ఉదయం ఈ ఒక్క డ్రింక్ తాగితే పొట్ట బయటకు రావడం తగ్గుతుందా?
12 June 2026
TV9 Telugu
TV9 Telugu
ఒక్కోసారి మార్కెట్‌లో దొరికే జీలకర్ర చూసి.. అసలు ఇది నిజమైనదేనా? అనే సందేహం కలుగుతుంది. అలాంటప్పుడు, కల్తీ జరిగిందో లేదో ఇలా కనిపెట్టేయండి
TV9 Telugu
జీలకర్రని చేత్తో నలిపితే విరగకుండా ఉంటే సహజమైనది. అప్పుడు సువాసన కూడా వస్తుంది. అలా రాకపోతే కల్తీ జరిగినట్లే
TV9 Telugu
కొద్దిగా నీళ్లలో జీలకర్రను వేసి నానబెడితే రంగు రాకుండా ఉంటే సహజమైనది. వేయించినప్పుడు మంచి సువాసన రాకపోతే.. అనుమానించాల్సిందే
TV9 Telugu
అసలైజ జీలకర్ర కొనడం ఎంత ముఖ్యమో.. దాన్ని సరైన రీతిలో వాడటం కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా జీలకర్రతో అధిక బరువుకు చిటికెలో చెక్ పెట్టొచ్చు
TV9 Telugu
ఉదయం ఖాళీ కడుపుతో తీసుకునే జీలకర్ర నీరు, మెంతుల నీరు వంటి సంప్రదాయ పానీయాలు బరువు నియంత్రణలో సహాయపడతాయని విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి
TV9 Telugu
అయితే ఇవి నేరుగా కొవ్వును కరిగించకపోయినా, శరీరంలోని కొన్ని జీవక్రియలను మెరుగుపరచడం ద్వారా పొట్ట కొవ్వు తగ్గుదలకు పరోక్షంగా దోహదపడతాయి
TV9 Telugu
జీలకర్ర నీటిని సాధారణంగా జీలకర్ర గింజలను రాత్రంతా నానబెట్టి లేదా నీటిలో మరిగించి తయారు చేస్తారు. ఉదయం ఖాళీ కడుపుతో తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది
TV9 Telugu
కడుపులో ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గించడంలో ఇవి ఉపయోగపడతాయి. అలాగే జీవక్రియల వేగాన్ని పెంచి శరీరంలో కొవ్వు నిల్వ అయ్యే విధానాన్ని ప్రభావితం చేస్తాయి