ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ బుల్లెట్ రైల్ కారిడార్ దేశంలో మొట్టమొదటి కారిడార్‌గా చరిత్ర సృష్టిస్తోంది. మహారాష్ట్ర, గుజరాత్, దాద్రా నగర్ హవేలీల గుండా ప్రయాణిస్తూ దేశంలోని కీలక ఆర్థిక నగరాలను అనుసంధానిస్తుంది.
వయాడక్ట్‌లు, సుదీర్ఘ సొరంగాలు, అత్యాధునిక వంతెనలు, స్టేషన్లు, సిగ్నలింగ్ వ్యవస్థలతో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా పారిశ్రామిక సామర్థ్యం, సరికొత్త సంస్థాగత పరిజ్ఞానం పెరుగుతోంది. ఇది భవిష్యత్తులో దేశవ్యాప్త విస్తరణకు తోడ్పడుతుంది.
సెప్టెంబర్ 2017లో ఈ హైస్పీడ్ రైలు కారిడార్‌కు శంకుస్ధాపన చేయగా.. దేశంలో బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు ఆ రోజు అధికారికంగా రైల్వేశాఖ నాంది పలికింది.
ఈ కారిడార్‌లో రైళ్ల వేగం గరిష్టంగా గంటకు 350 కిలోమీటర్ల సామర్థం కాగా.. గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనున్నాయి. ఇందుకోసం జపాన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు
ఈ ప్రాజెక్ట్ వల్ల ముంబై- అహ్మదాబాద్ నగరాల మధ్య ప్రయాణ సమయం తగ్గనుంది. కేవలం గంట 58 నిమిషాల్లోనే రెండు నగరాల మధ్య ప్రయాణించవచ్చు. ప్రస్తుతం చాలా సమయం పడుతుంది.
ఈ మార్గం దాదాపు 90 శాతం ఎలివేటెడ్ కారిడార్‌గా ఉంటుంది. దీనిని పుల్ స్పాన్ లాంచింగ్ మెటడ్ అనే సరికొత్త సాంకేతికతతో వేగంగా నిర్మిస్తున్నారు. కారిడార్‌లో 25 నదీ వంతెనలు ఉన్నాయి. వాటిలో 21 గుజరాత్‌లో ఉంటాయి.
వచ్చే ఏడాది ఆగస్ట్ 15న ఈ కారిడార్‌లో తొలి బుల్లెట్ ట్రైన్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు కేంద్రం సిద్దమవుతోంది. ఈ మేరకు ముహూర్తం ఫిక్స్ చేసింది. అందుకనుగుణంగా పనులు జరుగుతున్నాయి.
ఈ కారిడార్‌లో మొత్తం 12 స్టేషన్లు ఉంటాయి. ముంబై , థానే, విరార్, బోయిసర్, వాపి, బిలిమోరా, సూరత్, భరూచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్, సబర్మతి స్టేషన్లు ఉన్నాయి . ప్రతి స్టేషన్ నగర స్వభావం, స్ఫూర్తిని ప్రతిబింబించేలా నిర్మిస్తున్నారు.