AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Technology News: ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు బంద్..

ప్రపంచవ్యాప్తంగా ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్, మెస్సేంజర్ సేవలు నిలిచిపోయాయి. అంతరాయం కారణంగా బంద్ అయ్యాయి. శుక్రవారం సాయంత్రం ఒక్కసారి మెటా సేవలకు అంతరాయం కలిగింది. అయితే దీని గురించి మెటా నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా..

Technology News: ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు బంద్..
Facebook
Venkatrao Lella
|

Updated on: Jun 12, 2026 | 8:26 PM

Share

ప్రపంచవ్యాప్తంగా మెటా సేవలన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. మెటా ఆధ్వర్యంలో నడుస్తున్న ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్‌, థ్రెడ్స్‌ సేవలు అంతరాయం కారణంగా నిలిచిపోయాయి. వాట్సప్‌ సేవలు పొందటంలో కూడా కొంతమంది యూజర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారు. లాగిన్ అవ్వడం, ఫీడ్ లోడింగ్, మెస్సేజ్‌లు వెళ్లకపోవడం వంటి సేవలు నిలిచిపోయాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లు ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది అకౌంట్లు ఆటోమేటిక్‌గా లాగౌట్ అవ్వగా.. తిరిగి లాగిన్ అవుతుంటే అవ్వడం లేదు. అయితే దీని గురించి ఇంకా మెటా అధికారిక ప్రకటన చేయలేదు. మెటా స్పందిస్తే కానీ సమస్య ఏంటనేది తెలియదు.

అయితే మెటా సేవలు పొందటంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో యూజర్లు మెటాకు ఫిర్యాదు చేస్తున్నారు. కానీ మెటా నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఇక సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ అంతరాయాలను ట్రాక్ చేసే ప్రముఖ వెబ్‌సైట్ అయిన డౌన్‌డిటెక్టర్.. ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ వెబ్‌సైట్‌లకు సంబంధించిన డేటాను ప్రదర్శించలేదు. దీంతో ఈ అంతరాయంపై నివేదించడం సంక్లిష్టంగా మారింది. సాధారణంగా వెబ్‌సైట్ అంతరాయాలను నివేదించే డౌన్‌డిటెక్టర్.. దానికి బదులుగా ఫేస్‌బుక్ఇ, న్‌స్టాగ్రామ్ రెండింటికీ “404 పేజీ కనుగొనబడలేదు” అనే లోపాన్ని ప్రదర్శిస్తోంది.

Follow Us