AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదేం విడ్డూరం సామీ.. చీమలను కూడా స్మగ్లింగ్ చేస్తారా? ఏకంగా కోట్లలో వ్యాపారం..

ఇంట్లో కాస్త చక్కెర ఎక్కడైనా కనిపిస్తే చీమలు అటాక్‌ చేయడం షరా మామూలే. వాటిని వదిలంచుకోవడానికి గృహిణులు నానాతిప్పలు పడుతుంటారు. అయితే ఎందుకూ పనికిరావని చిరాకు పడే ఈ చీమలతో అంతర్జాతీయ స్థాయిలో కోట్లలో వ్యాపారం చేస్తున్నారనీ మీకు తెలుసా..? అవును..

ఇదేం విడ్డూరం సామీ.. చీమలను కూడా స్మగ్లింగ్ చేస్తారా? ఏకంగా కోట్లలో వ్యాపారం..
Live Ants Smuggling
Sravan Kumar B
| Edited By: |

Updated on: Mar 19, 2026 | 7:58 PM

Share

హైదరాబాద్, మార్చి 19: మార్చి 2026లో కెన్యా జోమో కెన్యాటా అంతర్జాతీయ విమానాశ్రయంలో చైనా పౌరుడు జాంగ్ కెక్యూన్ (Zhang Kequn), కెన్యా పౌరుడు చార్లెస్ మ్వాంగి (Charles Mwangi) 2000 గార్డెన్ క్వీన్ చీమలు (queen ants) స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డాడు. చీమలను టెస్ట్ ట్యూబులు, టిష్యూ పేపర్‌లో దాచి చైనాకు స్మగ్లింగ్ చేస్తూ దొరికారు. ప్రతి 100 చీమలను KSh 10,000 ($77) ఇచ్చి కొనుగోలు చేశారు. వీటి మొత్తం విలువ 500,000 డాలర్లు.

క్వీన్ చీమలు (queen ants) కాలనీ ప్రారంభించే సామర్థ్యం కలిగి ఉంటాయి. ఆఫ్రికన్ గార్డెన్ యాంట్స్ (Messor cephalotes వంటివి) పెద్దవి (24mm), ఎర్ర-కాలు రంగులు, కాలనీలు ఆకర్షణీయంగా పెరుగుతాయి. ఫార్మికేరియం (చీమల ఫార్మ్)లో పెంచుకునే హాబీస్టులకు డిమాండ్ ఎక్కువ. ఒక్కో క్వీన్ $50-500 ( అంటే రూ.4,000-40,000) వరకు ధర పలుకుతుంది. ఆన్‌లైన్ (AntsCanada, eBay)లో బ్లాక్ మార్కెట్ ట్రేడ్ బాగా ఈ దందా జరుగుతుంది.

పెట్ యాంట్ క్రేజ్ (చైనా, యూరప్, ఆసియా, అమెరికాలో) వల్ల ధరలు ఎక్కువగా ఉన్నాయి. కెన్యాలో రేర్ స్పీసీస్ సులభంగా దొరుకుతాయి. లైసెన్స్ లేకుండా ఎగుమతి చేస్తే ప్రాఫిట్ భారీగా ఉంటుంది. 5000 చీమలు €800,000 ($900,000) వరకు వెచ్చిస్తాయి. ఎకాలజీకి ఆధారం (మట్టి ఆక్సిజన్, గింజల ప్రచారం) కానీ ట్రాఫికింగ్ వల్ల ఇవి చిన్నపాటి కాలనీలను ఏర్పాటు చేసుకుంటాయి. కాగా ఇప్పటికే పలుమార్లు చీమల కేసులు వెలుగులోకి వచ్చాయి. మే 2025లో కెన్యాలో 2 బెల్జియన్ టీనేజర్లు, వియత్నామీస్, కెన్యన్ 5,000 గియంట్ ఆఫ్రికన్ వెస్టర్ క్వీన్ చీమలు స్మగ్లింగ్ చేస్తూ దొరికారు. వారికి ఏడాది సంవత్సరం జైలు లేదా 7,700 డాలర్లు ఫైన్ కూడా పడింది. ఇక ఏప్రిల్ 2025లో ‘ఆంట్ గ్యాంగ్’ 5,000 చీమలు ట్రాఫికింగ్ వెలుగులోకి వచ్చింది. క్వీన్ చీమలు $130 పైగా విక్రయం చేసారు. 2025లోనే బ్యాంకాక్‌లో కెన్యా నుంచి భారీ ఎత్తున చీమలు పట్టుకున్నారు. ఇలా చీమలను స్మగ్లింగ్ చేసేందుకు ఒక ఆర్గనైజ్డ్ నెట్‌వర్క్‌ కూడా పనిచేస్తుంటుందట.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us