తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు సమగ్ర కులగణన (Telangana Caste Census)ను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 1.17 కోట్లకు పైగా ఇళ్లను గుర్తించి మొదటి దశలో వాటికి స్టిక్కర్లు అంటించారు. రెండో దశలో ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలను సేకరిస్తున్నారు. మొత్తం 8 పేజీల్లో 56 అంశాలకు సంబంధించి 75 ప్రశ్నల ద్వారా సమాచారం సేకరిస్తున్నారు. అయితే ఇందులో ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య ఇలా అన్ని అంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.