AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGSRTC: ఈ బస్సుల మీద ఏముందో జాగ్రత్తగా గమనించండి.. ఐడియా చూస్తే ఆశ్చర్యపోతారు

ఈ బస్సుల మీద ఏముందో జాగ్రత్తగా గమనించండి.. కాస్త జూమ్ చేసి చూస్తే ఆశ్చర్యపోతారు. ఆర్టీసీ ఐడియా అదుర్స్ బ్రదరూ అని పొగిడేస్తారు. మరి ఆ ఐడియా ఏంటి.? ఆ వివరాలు ఇప్పుడే చూసేద్దాం. ఓ సారి లుక్కేయండి. లేట్ ఎందుకు..

TGSRTC: ఈ బస్సుల మీద ఏముందో జాగ్రత్తగా గమనించండి.. ఐడియా చూస్తే ఆశ్చర్యపోతారు
Tgsrtc
Sravan Kumar B
| Edited By: |

Updated on: Feb 27, 2026 | 6:53 PM

Share

దేశంలోనే తొలిసారిగా “జీఐ ఆన్ వీల్స్” కార్యక్రమాన్ని టీజీఎస్ఆర్టీసీ శుక్రవారం ప్రారంభించింది. భౌగోళిక గుర్తింపు జియోలాజికల్ ఐడెంటిటీ(GI) పొందిన తెలంగాణ హస్తకళలతో అలంకరించిన ప్రత్యేక బస్సులను రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి జెండా ఊపి విడుదల చేశారు. బస్సులు ‘కదిలే గ్యాలరీలు’గా మారడం ఎందుకు.? తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రజలకు చేరువ చేయాలనే ఈ క్రియేటివ్ ఐడియా చేశారు. పోచంపల్లి ఇక్కత్, వరంగల్ తివాచీలు(కార్పెట్లు), కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ, నారాయణపేట్ చీరలు, చెరియల్ స్క్రాల్ పెయింటింగ్స్, నిర్మల్ పెయింటింగ్స్ లాంటి ఆరు GI హస్తకళలు బస్సు ప్యానెల్స్‌పై ప్రదర్శించారు.

ఈ డిజైన్‌లను JNAFAU(జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ) విద్యార్థులు రూపొందించారు. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మాట్లాడుతూ, “GI కళలపై అవగాహన పెంచడం, సంప్రదాయాలను ప్రాచుర్యంలోకి తీసుకురావడం ఈ కార్యక్రమ లక్ష్యం. సంస్కృతి సమాజ ఆత్మ, యువతలో ఆసక్తి పెంచుతుంది” అని పేర్కొన్నారు. GI ఉత్పత్తుల ప్రమోషన్‌కు ప్రభుత్వం కట్టుబడి ఉంది. గ్రామీణ కళాకారులకు ఉపాధి పెరుగుతుందని అధికారులు తెలిపారు. సంస్కృతిని ప్రజలకు చేరువ చేస్తూ కళాకారులకు ప్రోత్సాహం. GI అంటే ఒక ప్రాంతానికి ప్రత్యేకమైన నైపుణ్యం, సంప్రదాయాన్ని సూచించే మేధోసంపద. తెలంగాణకు 18 GI ఉత్పత్తులు ఉన్నాయి. ఇది కళలను సంరక్షిస్తూ, నకిలీలను అరికట్టి, కళాకారుల జీవనోపాధిని బలోపేతం చేస్తుంది. TGSRTC బస్సులు ఇకపై కేవలం రవాణా మాధ్యమం కాదు, తెలంగాణ వారసత్వాన్ని వ్యాప్తి చేసే ‘కదిలే గ్యాలరీలు’గా మారాయి.!

Follow Us