Tiger: పులి పంజా దెబ్బ ఎట్టుంటుందో తెల్సా..! కొడితే ఎద్దు తల పగిలిపోతుంది
పులి పంజా దెబ్బ ఎట్టుంటుందో తెల్సా.? దాని పంజా టన్నుల కొద్దీ బరువు ఉంటుంది. ఎద్దు తలను కూడా పగలగొట్టగలదు. దాని ముళ్ల నాలుక ఎముకల నుంచి మాంసాన్ని సులభంగా వేరుచేయడానికి సహాయపడుతుంది. పులి గొంతును లక్ష్యంగా చేసుకుని వేటాడి, కేవలం మాంసాన్ని మాత్రమే తింటుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

పులి పంజాకు చాలా శక్తి ఉంటుంది. ఆ పంజా దెబ్బ టన్నుల కొద్దీ బరువు ఉంటుంది. కొన్ని వందల పౌండ్స్ పర్ స్క్వేర్ ఇంచ్(పి.ఎస్.ఐ.)లో కొలుస్తారు. దీనిని సాధారణంగా వివరించాలంటే, పులి పంజా దెబ్బ కొడితే ఎద్దు తల కూడా పగిలిపోతుంది. ఈ అపారమైన శక్తిని రైలు ఇంజిన్‌తోనూ, సుత్తితోనూ పోలుస్తారు. సుత్తి ఎంత భిన్నమైనదో, ఎంత ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుందో, పులి పంజా కూడా అంతే బలమైనది. ఎద్దు లేదా ఆవు పుర్రె చాలా గట్టిగా ఉన్నప్పటికీ, పులి పంజా దాన్ని పగలగొట్టగలదంటే దాని బలం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు.
పులి నాలుకపై కూడా ముళ్లు ఉంటాయి. ఈ ముళ్లు మనుషుల చర్మానికి ఈజీగా చీల్చి చెందాడుతాయ్. పులి నాలుకపై ఉండే నిర్మాణాలు కాస్త రఫ్‌గా ఉంటాయి. దీనికి గల కారణం పులి మాంసాహారం తినే జంతువు కావడం. మాంసం తింటున్నప్పుడు, ఆహారం ఎముకలకు పట్టుకుని ఉంటుంది. మనం మాంసాన్ని చేతులతో లాగగలం, కానీ పులికి చేతులు లేవు. అందువల్ల, ఎముకలకు పట్టుకున్న మాంసాన్ని సులువుగా లాగి తినడానికి వీలుగా పులి నాలుక అలా పరిణామం చెందింది. ఈ ముళ్ల సహాయంతో అది మాంసాన్ని ఎముకల నుంచి సమర్థవంతంగా వేరుచేస్తుంది.
పులి వేట పద్ధతి కూడా చాలా వ్యూహాత్మకంగా ఉంటుంది. అది ఒక జంతువును చంపిన తర్వాత, ముందుగా గొంతు లేదా మెడ భాగాన్ని పట్టుకుంటుంది. ఎందుకంటే ఈ పైభాగం నుంచి కిందికి కీలకమైన ధమనులు, సిరలు, వాయునాళాలు ప్రవహిస్తాయి. ఈ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడం వల్ల వేటాడిన జంతువు త్వరగా ప్రాణాలు కోల్పోతుంది. మిగతా ఏ ప్రాంతంలో పట్టుకున్నా కూడా జంతువు ప్రతిఘటించే అవకాశం ఉంటుంది. ఆహారపు అలవాట్ల విషయానికి వస్తే, పులి కేవలం మాంసాన్ని మాత్రమే తింటుంది. లోపల పొట్ట, పేగులు లాంటి అంతర్గత అవయవాలను అది తినదు, వాటిని వదిలేస్తుంది. మాంసం తినేటప్పుడు, అది వెనుక భాగం నుంచి ప్రారంభించి, మొత్తం మాంసం ఉన్న భాగాలన్నింటినీ తినేస్తుంది. ఒకసారి సుమారు 20 నుంచి 30 కిలోల మాంసాన్ని తినగలదు. అయితే, పులి కొన్నిసార్లు వేటాడిన తర్వాత రెండు, మూడు రోజులు కూడా వేచి ఉంటుంది.
