అమెరికాలో సడెన్ గా కుంగిన భూమి.. గుంతలో పడ్డ కార్లు
అమెరికాలోని ఒమాహాలో 67వ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రోడ్డు ఉన్నట్టుండి కుంగి భారీ గుంత ఏర్పడింది. ఆ సమయంలో ఆగిన రెండు కార్లు గుంతలో పడిపోయాయి. ప్రయాణికులకు పెద్దగా గాయాలు కాలేదు. భూగర్భ నీటి పైప్‌లైన్ లీకేజ్ కారణంగానే ఈ సింక్‌హోల్ ఏర్పడిందని ఇంజనీర్లు తెలిపారు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డై, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరమ్మతులు కొనసాగుతున్నాయి.
అమెరికాలోని ఒమాహా సిటీలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రోడ్డు ఉన్నట్టుండి కుంగి భారీ గుంత ఏర్పడింది. ఆ సమయంలో రెడ్ సిగ్నల్ పడడంతో అక్కడ ఆగిన రెండు కార్లు గుంతలో పడిపోయాయి. అయితే అందులోని ప్రయాణికులకు పెద్దగా గాయాలు కాలేదు. ఈ ఘటన మొత్తం అక్కడున్న సీసీటీవీ కెమెరాలలో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒమాహా సిటీలోని 67వ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో వాహనాలు ఆగుతున్న సమయంలో ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయి భారీ గుంత ఏర్పడింది. ఊహించని ఈ షాకింగ్ ఘటనలో ఒక ఎస్‌యూవీ, మరో పికప్ ట్రక్ గుంతలో పడిపోయాయి. అత్యవసర సేవా సిబ్బంది అక్కడికి చేరుకునేలోపే, ఆ రెండు వాహనాల్లోని డ్రైవర్లను తోటి వాహనదారులు కాపాడారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. భూగర్భంలో నీటి పైపులైన్ లీక్ కావడం వల్ల లోపల మట్టి కోతకు గురై, పైన ఉన్న రోడ్డుకు పట్టు కోల్పోవడమే ఈ సింక్ హోల్ ఏర్పడటానికి కారణమని సిటీ ఇంజనీర్ ఆస్టిన్ రోజర్ తెలిపారు. గుంత మరింత విస్తరించే అవకాశం ఉన్నందున ఆ ప్రాంతానికి ఎవరూ రావద్దని పోలీసులు హెచ్చరించారు. మెట్రోపాలిటన్ యుటిలిటీస్ డిస్ట్రిక్ట్ సిబ్బంది ఘటనా స్థలంలో మరమ్మతులు చేపట్టారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pomegranate: ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దానిమ్మ తింటే.. అంతే సంగతులు
పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!
ఎల్‌నినోతో ఫైట్.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!
ఎల్‌నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?

