శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో టిప్పర్‌కు మంటలు అంటుకున్నాయి. హైడ్రాలిక్ లిఫ్టును పైకి లేపగా హైటెన్షన్ విద్యుత్ తీగలు తాకడంతో షార్ట్ సర్క్యూట్ జరిగింది. డ్రైవర్ సమయస్ఫూర్తితో వాహనం నుంచి దూకి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు.