AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: అయ్యో ఎంత విషాదం.. దైవ దర్శనానికి వెళ్తుండగా దారికాచిన మృత్యువు.. స్పాట్‌లోనే..

నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఫ్యామిలీ కారులో శ్రీశైలం మల్లికార్జున స్వామివారి దర్శనానికి వెళ్తుండగా కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న క్రెయిన్ టైర్‌ను ఢీకొట్టి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

Andhra News: అయ్యో ఎంత విషాదం.. దైవ దర్శనానికి వెళ్తుండగా దారికాచిన మృత్యువు.. స్పాట్‌లోనే..
Andhra News (1)
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Feb 27, 2026 | 6:25 PM

Share

శ్రీశైలం దర్శనానికి కారులో వెళుతున్న కర్ణాటకకు చెందిన ప్రమోద్ కుటుంబం నంద్యాల జిల్లా డోన్ జాతీయ రహదారిలో జగదుర్తి సమీపంలో క్రేన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్య శాంత(36), కుమారుడు సిద్ధార్థ(6), కూతురు భార్గవి(5) ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ప్రమోదు తన భార్య పిల్లలతో శ్రీశైలం దర్శనానికి కారులో బయలుదేరాడు.

డోన్ జాతీయ రహదారిలోని జగదుర్తి స్టేజి సమీపంలో ఎదురుగా వస్తున్న క్రేన్ వచ్చి కారును ఢీ కొట్టడంతో కారు పల్టీలు కొట్టి పక్కనే ఉన్న పొలంలోకి దూసుకెళ్లింది,ఈ ప్రమాదంలో ప్రమోద్ భార్య శాంత, కుమారుడు సిద్ధార్థ్, కూతురు భార్గవి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను వెలికి తీసి పోస్ట్‌ మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు.

తీవ్ర గాయాలైన ప్రమోదును డోన్ ప్రభుత్వాసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం కర్నూల్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us