AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.15 వేల స్టైపెండ్ నుంచి రూ.25 లక్షల ప్యాకేజీ వరకు.. కేవలం 2 ఏళ్లలో ఓ టెకీ కెరీర్ జర్నీ

ఓ టెకీ కెరీర్ ఎదుగుదల సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెలకు రూ.15 వేల ఇంటర్న్‌షిప్ స్టైపెండ్‌తో ప్రారంభమైన అతడి ప్రయాణం కేవలం రెండున్నరేళ్లలో రూ.25 లక్షల వార్షిక ప్యాకేజీ వరకు చేరింది. కష్టపడి పనిచేయడం, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం, సరైన సమయంలో ఉద్యోగాలు మారడం వల్ల ఈ స్థాయికి చేరుకున్నాడని అతడి క్లాస్ మెట్ నెట్టింట పోస్టు చేయడంతో అదికాస్తా వెరల్ అయింది..

రూ.15 వేల స్టైపెండ్ నుంచి రూ.25 లక్షల ప్యాకేజీ వరకు.. కేవలం 2 ఏళ్లలో ఓ టెకీ కెరీర్ జర్నీ
Techie Remarkable Journey
Srilakshmi C
|

Updated on: Aug 06, 2026 | 7:29 PM

Share

ఓ టెకీ కెరీర్ ఎదుగుదల సోషల్ మీడియాలో చర్చోప చర్చలకు దారితీసింది. అతడి మాజీ కాలేజీ క్లాస్‌మేట్ రుతుజా సోషల్ మీడియా వేదికగా టెకీ స్ఫూర్తిదాయక ప్రయాణం పోస్టు చేయడంతో పలువురిని ఆకట్టుకుంది. కేవలం రెండున్నరేళ్లలో తక్కువ స్థాయి ఇంటర్న్‌షిప్ స్టైపెండ్ నుంచి భారీ జీతం అందుకునే స్థాయికి అతడు ఎదిగాడు. రుతుజా తెలిపిన వివరాల ప్రకారం.. ఆ టెకీ తన కెరీర్‌ను నెలకు రూ.15,000 ఇంటర్న్‌షిప్ స్టైపెండ్‌తో ప్రారంభించాడు. కష్టపడి పనిచేయడం, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం ద్వారా ఆరు నెలల్లోనే తొలి ఫుల్‌టైమ్ ఉద్యోగాన్ని సాధించాడు. ఆ సమయంలో అతడి వార్షిక ప్యాకేజీ రూ.7 లక్షలు. తర్వాత పనితీరు ఆధారంగా జీతం పెంపుతో అతడి ప్యాకేజీ రూ.9 లక్షలకు చేరింది. అనంతరం మరో కంపెనీ నుంచి రూ.14 లక్షల వార్షిక వేతనంతో ఆఫర్ అందుకుంది. ప్రస్తుత కంపెనీ అతడిని కొనసాగించేందుకు అదే స్థాయి ప్యాకేజీని ఆఫర్ చేసింది. ఆ తర్వాత సింగపూర్‌కు చెందిన ఓ సంస్థలో రూ.25 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం సాధించాడు.

‘అతడి ఎదుగుదల చూసి చాలా సంతోషంగా ఉంది. కాలేజీ రోజుల నుంచే అతడి అంకితభావాన్ని నేను చూశాను. అందుకే అతడు ఈ విజయానికి అర్హుడని’ రుతుజా ఎక్స్‌ (X) వేదికగా పేర్కొంది. అయితే ఈ ప్రయాణాన్ని చూసిన తర్వాత తన కెరీర్ గురించి కూడా ఆలోచించానని ఆమె చెప్పింది. ‘నేను కూడా కోడింగ్ కొనసాగించి ఉంటే ఇలాంటి స్థాయికి చేరుకునేదాన్నా?’ అని ప్రశ్నించుకున్నట్లు తెలిపింది. ప్రతి ఒక్కరి ప్రయాణం భిన్నంగా ఉంటుందని, ఇతరులతో పోల్చుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

ఈ పోస్ట్‌కు యువ ఉద్యోగుల నుంచి భారీ స్పందన వచ్చింది. నైపుణ్యాల అభివృద్ధి, సరైన సమయంలో ఉద్యోగ మార్పులు కెరీర్ ఎదుగుదలకు దోహదపడతాయని పలువురు అభిప్రాయపడ్డారు. అయితే కేవలం ఎక్కువ జీతం కోసం మారకుండా.. కెరీర్ వృద్ధి, నేర్చుకునే అవకాశాలు, స్థిరత్వాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని కొందరు సూచించారు.

Follow Us