AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth Praveen: అచ్చం ఆ సినిమాలో జరిగినట్లే.. నాన్న చనిపోయాక జబర్దస్త్ ప్రవీణ్ అన్ని కష్టాలు పడ్డాడా?

జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో పటాస్ ప్రవీణ్ కూడా ఒకడు. తన కామెడీతో బుల్లితెరపై చాలా మంది అభిమానులను సంపాదించుకున్నాడు ప్రవీణ్. ఇటీవలే వంశిత అనే నటి, డ్యాన్సర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే చాలా మందిలాగే ఈ జబర్దస్త్ నటుడి జీవితంలోనూ చాలా కన్నీటి కష్టాలున్నాయి.

Jabardasth Praveen: అచ్చం ఆ సినిమాలో జరిగినట్లే.. నాన్న చనిపోయాక జబర్దస్త్ ప్రవీణ్ అన్ని కష్టాలు పడ్డాడా?
Jabardasth Praveen
Basha Shek
|

Updated on: Aug 06, 2026 | 9:05 PM

Share

జబర్దస్త్ కమెడియన్ పటాస్ ప్రవీణ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పటాస్ షోలో స్టాండప్ కమెడియన్ గా ఆకట్టుకున్న ఇతను జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ నటుడి కామెడీ పంచులు, ప్రాసలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా ఫైమా, ప్రవీణ్ కాంబినేషన్ లో వచ్చిన స్కిట్స్ బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి. అలాగే యూట్యూబ్ లోనూ భారీగా వ్యూస్ వచ్చాయి. ఒక్క జబర్దస్త్ లోనే కాదు శ్రీదేవీ డ్రామా కంపెనీ వంటి పలు టీవీ షోల్లో సందడి చేస్తున్నాడు ప్రవీణ్. అలాగే అప్పుడప్పుడు సినిమాల్లోనూ కనిపిస్తుంటాడీ జబర్దస్త్ కమెడియన్. ఇక పర్సనల్ లైఫ్ పరంగానూ ఇటీవలే ఓ కొత్త జీవితానికి శ్రీకారం చుట్టాడు ప్రవీణ్. తన తోటి నటి వంశిత అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం మ్యారీడ్ లైఫ్ ను బాగా ఆస్వాదిస్తున్నాడు ప్రవీణ్. తన భార్యతో కలిసి దిగిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు ప్రవీణ్. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకన్నాడు. ఇదే క్రమంలో తండ్రి మరణం తర్వాత తనకు ఎదురైన గడ్డు పరిస్థితులను గుర్తు చేసుకుని బాగా ఎమోషనల్ అయ్యాడు.

ప్రవీణ్ తండ్రి 2022లో మరణించారు. ఒకసారి ప్రవీణ్ తో పాటు ఆయన కూడా ఓటీవీ షోలో సందడి చేశారు. ఈ క్రమంలో తన తండ్రి గురించి మాట్లాడిన ప్రవీణ్.. ‘కొన్నేళ్ల క్రితం మా నాన్న చనిపోయారు. అయితే అంతకు ముందు కొందరిని బాగా నమ్మి మా నాన్న ష్యూరిటీ సంతకాలు చేశారు. దీంతో ఆ డబ్బులు మేము కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మా నాన్న కు చెడ్డ పేరు రాకూడదని నేను దాచుకున్న డబ్బులు అన్ని వాటికి కట్టేసాను. ఒక వేళ సంతకాలు చేసింది ఆయనే కదా అని డబ్బులు ఇవ్వకపోతే, జనాల డబ్బులు ఎగ్గొట్టి నేను ఇల్లు, కార్ కొనుకున్నా అంటారు. అందుకే నాన్నకు చెడ్డపేరు రాకూడదు అని మొత్తం తీర్చేశాను. నిజానికి నేను మా నాన్న ఇచ్చిన సపోర్ట్ వల్లే నేను ఈ స్థాయికి చేరుకున్నాను. నా 9వ తరగతిలోనే మా అమ్మ చనిపోయింది. మా అమ్మ చనిపోయేటప్పుడే మా అందర్నీ దగ్గరకు తీసుకొని మా నాన్నకు ఇంకో పెళ్లి చేసుకోవద్దు. నా పిల్లలను బాగా చూసుకో. వాళ్లు గొప్ప వాళ్లు అవుతారు అని చెప్పి కన్నుమూసింది. అమ్మకు మాటిచ్చినట్లుగానే నాన్న ఎంతో కష్టపడి మమ్మల్ని ప్రయోజకులను చేశారు. నేను పదో తరగతి పూర్తవ్వగానే ఇండస్ట్రీలోకి వచ్చాను. అప్పుడు మా నాన్న బాగా సపోర్ట్ చేశారు. ఇక్కడ జరిగిన కొన్ని సంఘటనల కారణంగా నేను భయపడితే ఆయనే చాలా ధైర్యం ఇచ్చారు’ అని ఎమోషనల్ అయ్యాడు.

ఇవి కూడా చదవండి

భార్యతో జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us