AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway Ticket Booking: రైల్వే టికెట్ల బుకింగ్‌కు కొత్త రూల్స్.. ఆగస్ట్ 1 నుంచి అమల్లోకి వచ్చేశాయి.. ఇకపై..

రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తత్కాల్ టికెట్ల బుకింగ్స్‌లో నూతన మార్పులు చేసింది. ఇక నుంచి రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల వద్ద తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలంటే ముందు చేరుకోవాల్సి ఉంటుంది. ముందే వచ్చి టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వివరాలు చూస్తే.

Railway Ticket Booking: రైల్వే టికెట్ల బుకింగ్‌కు కొత్త రూల్స్.. ఆగస్ట్ 1 నుంచి అమల్లోకి వచ్చేశాయి.. ఇకపై..
Tatkal Ticket Booking
Venkatrao Lella
|

Updated on: Aug 07, 2026 | 3:46 PM

Share

రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్. తత్కాల్ టిక్కెట్లు బుక్ చేసుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. రైల్వేశాఖ ఆగస్టు 1వ తేదీ నుండి కీలక మార్పులు చేసింది. రైల్వే తత్కాల్ టిక్కెట్ల బుకింగ్ రూల్స్‌లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. తత్కాల్ టిక్కెట్ బుకింగ్ కోసం టోకెన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. రైల్వే టిక్కెట్ కౌంటర్ల వద్ద తత్కాల్ టికెట్లు పొందాలంటే ఈ నిబంధన వర్తిస్తుంది. ఆన్‌లైన్ బుకింగ్‌లో ఎలాంటి మార్పులు జరగలేదు. రైల్వే రిజర్వేషన్ కౌంటర్ వద్ద పొడవైన క్యూలు, రద్దీని తగ్గించేందుకు టోకెన్ వ్యవస్థ తీసుకొచ్చారు. దీని వల్ల ప్రజలు గంటల తరబడి క్యూలలో నిలబడాల్సిన అవసరం ఉండదు.

ముందుగానే టోకెన్ జారీ

రైల్వే కౌంటర్ల వద్ద ముందుగా ఒక టోకెన్ తీసుకోవాలి. ఆ తర్వాత టోకెన్ నంబర్ ప్రకారం వారిని టిక్కెట్ కౌంటర్‌కు పిలుస్తారు. మీ టోకెన్ వచ్చినప్పుడు వెళ్లి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏసీ, నాన్ ఏసీ స్లీపర్ తత్కాల్ టిక్కెట్ల కోసం వేర్వేరు టోకెన్ల టైమింగ్స్ అమలు చేస్తున్నారు. ఏసీ తత్కాల్ టిక్కెట్ల బుకింగ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రయాణికులకు ఉదయం 8:30 నుండి 9 గంటల మధ్య టోకెన్లు జారీ చేస్తారు. నాన్ ఏసీ లేదా స్లీపర్ తత్కాల్ టిక్కెట్ల బుకింగ్ ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ టిక్కెట్ల కోసం టోకెన్ల పంపిణీ ఉదయం 9:30 నుండి 10 గంటల మధ్య జరుగుతుంది. మీరు ఏసీ తత్కాల్ టిక్కెట్ పొందాలనుకుంటే ముందుగా స్టేషన్‌కు సమయానికి చేరుకుని మీ టోకెన్‌ను తీసుకోవాలి. టిక్కెట్ బుకింగ్ ప్రారంభమైనప్పుడు కౌంటర్ల వద్ద అకస్మాత్తుగా పెరిగే రద్దీని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఎన్ని టోకెన్లు జారీ చేస్తారంటే..?

ఇక ప్రతి బుకింగ్ కౌంటర్ నుండి జారీ చేయాల్సిన టోకెన్ల సంఖ్యను కూడా రైల్వేశాఖ నిర్ణయించింది. ఏసీ తత్కాల్ టిక్కెట్ల కోసం గరిష్టంగా 10 టోకెన్లు జారీ చేస్తారు. నాన్-ఏసీ స్లీపర్ తత్కాల్ టిక్కెట్ల కోసం ఒక కౌంటర్ నుండి గరిష్టంగా 15 టోకెన్లు జారీ చేస్తారు. దీనివల్ల తమకు టిక్కెట్ బుక్ చేసుకునే అవకాశం లభిస్తుందో లేదో ప్రయాణికులు ముందుగానే తెలుసుకోగలుగుతారు.

Follow Us
కామన్వెల్త్ విజేతలతో ప్రధాని మోదీ సందడి..
కామన్వెల్త్ విజేతలతో ప్రధాని మోదీ సందడి..
పవర్ ఫుల్ గౌరీ హెగ్డేగా టబు.. స్లమ్ డాగ్ గ్లింప్స్ రిలీజ్..
పవర్ ఫుల్ గౌరీ హెగ్డేగా టబు.. స్లమ్ డాగ్ గ్లింప్స్ రిలీజ్..
కేవలం 30 నిమిషాల్లో కరకరలాడే జిలేబీ.. ఇంట్లో ఎలా చేయాలో తెలుసా?
కేవలం 30 నిమిషాల్లో కరకరలాడే జిలేబీ.. ఇంట్లో ఎలా చేయాలో తెలుసా?
స్వామి భద్రేశ్‌దాస్‌కు ‘వేదాంతవిద్యా విశ్వగురు’ గౌరవం
స్వామి భద్రేశ్‌దాస్‌కు ‘వేదాంతవిద్యా విశ్వగురు’ గౌరవం
10 ఏళ్లుగా ఎవ్వరూ టచ్ చేయలే.. ఏకైక భారత ఆటగాడిగా భారీ రికార్డ్..!
10 ఏళ్లుగా ఎవ్వరూ టచ్ చేయలే.. ఏకైక భారత ఆటగాడిగా భారీ రికార్డ్..!
ఊర కుక్కలు వర్సెస్ నీటి కుక్కలు.. పోరులో గెలుపు ఎవరిది..?
ఊర కుక్కలు వర్సెస్ నీటి కుక్కలు.. పోరులో గెలుపు ఎవరిది..?
గుంటూరు స్పెషల్ కాకరకాయ కారం.. ఇలా చేసి ఒక్కసారి తింటే ఇక వదలరు!
గుంటూరు స్పెషల్ కాకరకాయ కారం.. ఇలా చేసి ఒక్కసారి తింటే ఇక వదలరు!
అర్ధరాత్రి ఆర్టీసీ బస్సులో భారీ నగదుతోపాటు ల్యాప్‌టాప్ ప్రత్యక్షం
అర్ధరాత్రి ఆర్టీసీ బస్సులో భారీ నగదుతోపాటు ల్యాప్‌టాప్ ప్రత్యక్షం
పోలీస్ స్టేషన్ లో మనోజ్ రచ్చ.. సారీ చెప్పాలంటూ డిమాండ్..
పోలీస్ స్టేషన్ లో మనోజ్ రచ్చ.. సారీ చెప్పాలంటూ డిమాండ్..
జస్ట్‌ 45 మినెట్స్.. హైదరాబాద్‌ టూ విజయవాడ.. ఎగిరి గంతేసే న్యూస్
జస్ట్‌ 45 మినెట్స్.. హైదరాబాద్‌ టూ విజయవాడ.. ఎగిరి గంతేసే న్యూస్