AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్టోబర్ 14 రాశిఫలాలు: ఉద్యోగం, వ్యాపారంలో ఆ రాశులకు గుడ్‌న్యూస్

Horoscope Today (October 14, 2026): బుధవారం నాడు మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. కొన్ని రాశుల వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తే.. మరికొందరికి ఆదాయ మార్గాలు మెరుగుపడే అవకాశాలున్నాయి. ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం, ముఖ్యమైన ప్రయత్నాల్లో విజయం వంటి అంశాల్లో గ్రహాల ప్రభావం ఎలా ఉండనుందో చూడండి.

అక్టోబర్ 14 రాశిఫలాలు: ఉద్యోగం, వ్యాపారంలో ఆ రాశులకు గుడ్‌న్యూస్
Horoscore Today 14 October 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 14, 2026 | 6:00 AM

Share

దిన ఫలాలు (అక్టోబర్ 14, 2026): మేష రాశి వారికి వృత్తి, ఉద్యోగాలు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ఆశించినంతగా పురోగతి సాధిస్తారు. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగుతాయి. మిథున రాశి వారు ముఖ్యమైన ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. ఆదాయ మార్గాలు మరింతగా మెరుగుపడతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాలు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. కొద్దిపాటి వ్యయప్రయాసలతో పనులన్నీ సానుకూలంగా పూర్తవుతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. సంతాన ప్రాప్తికి సంబంధించి శుభవార్త వింటారు. కుటుంబ జీవితం ప్రశాం తంగా సాగిపోతుంది. జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగాలపరంగా ఒక శుభవార్త అందుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో ఆశించినంతగా పురోగతి సాధిస్తారు. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగుతాయి. నిరుద్యోగులకు సానుకూల స్పందన లభిస్తుంది. కెరీర్ పరంగా జీవిత భాగస్వామి కూడా పురోగతి చెందుతారు. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలుంటాయి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. మీ సలహాలు, సూచనలకు విలువ పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతల్ని నిర్వర్తించాల్సి వస్తుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి సమయం అనుకూలంగా ఉంది. వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ముఖ్యమైన ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. ఆదాయ మార్గాలు మరింతగా మెరుగుపడతాయి. పిల్లలు ఆశించిన స్థాయిలో వృద్ధిలోకి వస్తారు. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. కుటుంబ జీవితం సామర స్యంగా సాగిపోతుంది. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారం కావచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఇంటా బయటా అనుకూల పరిస్థితులుం టాయి. అనూహ్యంగా కొన్ని శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఒకటి రెండు వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. కొందరు స్నేహితుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ప్రయాణాలు పెట్టుకోకపోవడం మంచిది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

రోజంతా బాగానే గడిచిపోతుంది. ఏ రంగానికి చెందినవారైనప్పటికీ వ్యక్తిగతంగా తప్పకుండా పురో గతి ఉంటుంది. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. బంధువులతో చిన్నా చితకా ఇబ్బం దులు తప్పకపోవచ్చు. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. అధికారుల నుంచి ప్రోత్సాహం ఉంటుంది. ఇష్టమైన ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో అనుకోకుండా చిక్కులు ఎదురవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యాపారాలు నిలకడగా పురోగ మిస్తాయి. నిరుద్యోగులు ఆశించిన సమాచారం అందుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. ఆర్థికంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. బంధువుల్లో పెళ్లి సంబంధం కుదురుతుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఈ రాశివారికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం అయినా చేపట్టినా విజయం సిద్ధిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ సలహాలు, సూచనలతో అధికారులు లబ్ధి పొందుతారు. ఉద్యో గంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో కూడా మీ ఆలోచనలు సఫలం అవుతాయి. ఆదాయ మార్గాలు విస్తృతం అవుతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగాల్లో ఇతరుల మీద ఆధారపడకపోవడం మంచిది. సహోద్యోగులతో సామరస్యం పెరు గుతుంది. ఆర్థిక వ్యవహారాలు చాలావరకు చక్కబడతాయి. ఆదాయం అనుకూలంగా ఉన్న ప్పటికీ ఆచితూచి ఖర్చు చేయడం మంచిది. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. కుటుంబంలో ఒకటి రెండు సమస్యలు తలెత్తవచ్చు. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. అనుకోకుండా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాలు చాలావరకు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కొత్త ఉద్యోగావకాశాలు మెరుగుపడడంతో పాటు, ఉద్యోగం మారే అవకా శాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలను ప్రవేశపెట్టి ప్రయోజనం పొందుతారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు కనిపిస్తాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా లాభసాటిగా సాగుతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబసమేతంగా దైవ దర్శనాలు చేసుకుంటారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. కొందరు స్నేహితుల సహకారంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. వ్యక్తిగత సమస్యల మీద దృష్టి పెట్టడం మంచిది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ప్రతి పనిలోనూ శ్రమ, తిప్పట తప్పకపోవచ్చు. వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. రాదనుకున్న డబ్బు కొద్ది ప్రయ త్నంతో చేతికి అందుతుంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యులకు సంబంధించి ఆశించిన శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. దాంపత్య జీవితం సంతోషంగా, సామరస్యంగా సాగిపోతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు, లక్ష్యాలు బాగా పెరుగుతాయి. అధికారులు ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. ఆదాయం, ఆరోగ్యం బాగానే ఉంటాయి. ఆర్థికంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యాల్లోనూ, సామాజిక సేవల్లోనూ పాల్గొంటారు.

Follow Us