నీచ రవితో ఈ రాశులకు దశ తిరిగే ఛాన్స్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
Sun Transit 2026: అక్టోబర్ 17 నుంచి నవంబర్ 16 వరకు రవి తులా రాశిలో నీచస్థితిలో సంచరించనున్నాడు. జ్యోతిష్య అంచనాల ప్రకారం, ఈ గ్రహ సంచారం మిథునం, కర్కాటకం, ధనుస్సు, కుంభం, మీన రాశుల వారికి అనుకూల ఫలితాలను అందించనుంది. ఆదాయం పెరగడం, ఉద్యోగంలో అధికారం లభించడం, పెళ్లి ప్రయత్నాలు సఫలం కావడం, వృత్తి, వ్యాపారాల్లో విజయాలు సాధించే అవకాశాలున్నాయి.

Sun Transit 2026
ఈ నెల(అక్టోబర్) 17 నుంచి నవంబర్ 16 వరకు రవి తులా రాశిలో నీచబడడం జరుగుతోంది. గ్రహ రాజైన రవి నీచబడినప్పటికీ , మిథునం, కర్కాటకం, ధనుస్సు, కుంభం, మీన రాశులకు ఉన్నత ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ రాశులకు రవి బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతం కావడంతో పాటు, ఆదాయం పెరగడానికి, అధికారం లభించడానికి కూడా బాగా అవకాశం ఉంది. రవి శుభ గ్రహాలైన శుక్ర, బుధులతో కలవడం వల్ల పెళ్లి ప్రయత్నాలు సఫలం కావడం, వృత్తి, వ్యాపారాల్లో విజయాలు సాధించడం వంటివి కూడా జరుగుతాయి. నీచబడిన రవి ఈ రాశులకు ఆకస్మిక శుభ పరిణామాలు కలగజేస్తాడు.
- మిథునం: ఈ రాశికి పంచమ స్థానంలో రవి నీచ స్థితి వల్ల ఈ రాశివారిలో ఆత్మవిశ్వాసం, ధైర్యం, తెగువ, చొరవ వంటివి బాగా పెరుగుతాయి. అనుకున్నవి సాధిస్తారు. ఏ ప్రయత్నం చేపట్టినా సఫల మయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. పోటీ పరీక్షల్లో విజయాలు పొందే అవకాశం ఉంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి ధన వర్షం కురిపిస్తాయి. ఆస్తి వివాదాలు, కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి.
- కర్కాటకం: ఈ రాశికి ధనాధిపతి అయిన రవి చతుర్థ స్థానంలో సంచారం చేయడం వల్ల నీచభంగ రాజయోగం కలిగింది. దీని వల్ల రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభించడంతో పాటు ధన లాభం కూడా కలుగుతుంది. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశీ ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఉద్యోగంలో పదోన్నతులకు, వృత్తి, వ్యాపారాల్లో బాగా డిమాండ్ పెరగడానికి అవకాశం ఉంది. సంపన్న వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది.
- ధనుస్సు: ఈ రాశికి భాగ్య స్థానాధిపతిగా అత్యంత శుభుడైన రవి లాభ స్థానంలో ప్రవేశించడం వల్ల ఆర్థిక లాభాలు ఎక్కువగా కలుగుతాయి. రాజయోగాలు, ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. ప్రము ఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల ద్వారా కూడా ఆదాయం బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాల్ని మించుతుంది. ఆరోగ్య లాభం కలుగుతుంది.
- కుంభం: ఈ రాశికి సప్తమాధిపతి అయిన రవి భాగ్య స్థానంలో ప్రవేశించడం వల్ల ఉద్యోగులు, నిరుద్యోగు లకు కొద్ది ప్రయత్నంతో విదేశీ ఆఫర్లు అందుతాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న వారికి స్థిరత్వం లభిస్తుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. పిత్రార్జితం లభిస్తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. సంపద బాగా వృద్ధి చెందుతుంది.
- మీనం: ఈ రాశికి షష్టాధిపతి అయిన రవి అష్టమ స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి విప రీత రాజయోగం కలిగింది. ఉద్యోగంలో అందలాలు ఎక్కుతారు. ఉన్నత పదవికి అవకాశం ఉన్న ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెంది ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. రాజకీయ ప్రాబల్యం కలుగు తుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు.
ఇవి కూడా చదవండి
Also Read: పరివర్తన యోగం.. త్వరలో అదృష్టాలు పట్టబోయే రాశులివే..!
Follow Us



