AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి!

శని నక్షత్ర సంచారం 2026: అక్టోబర్ 9న శనిదేవుడు ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశించారు. 2027 ఫిబ్రవరి 8 వరకు ఆ నక్షత్రంలో కొనసాగే ఈ సంచారం వల్ల మేషం, సింహం, మకర రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో అనుకూల ఫలితాలు కలగవచ్చని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. ఈ మూడు రాశుల వారికి ఎలాంటి ప్రయోజనాలు కలగవచ్చో తెలుసుకుందాం.

శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి!
Shani Nakshatra Transit
Janardhan Veluru
|

Updated on: Oct 10, 2026 | 4:53 PM

Share

Shani Nakshatra Transit 2026: జ్యోతిష్యశాస్త్రంలో శనిదేవుడిని కర్మఫల ప్రదాతగా, న్యాయానికి ప్రతీకగా భావిస్తారు. శని అనుకూలంగా ఉన్నప్పుడు కష్టపడి పనిచేసేవారికి మంచి ఫలితాలు లభిస్తాయని జ్యోతిష్య విశ్వాసం. శని గ్రహం రాశి మార్పుతో పాటు నక్షత్ర సంచారం కూడా జ్యోతిష్యపరంగా ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. అక్టోబర్ 9, 2026న శనిదేవుడు రేవతి నక్షత్రం నుంచి ఉత్తరాభాద్ర క్షత్రంలోకి ప్రవేశించారు. ఈ నక్షత్రంలో 2027 ఫిబ్రవరి 8 వరకు కొనసాగనున్నారని జ్యోతిష్య గణనలు సూచిస్తున్నాయి. ఉత్తరాభాద్ర నక్షత్రానికి శని అధిపతి కావడంతో ఈ సంచారాన్ని ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా కష్టానికి తగిన గుర్తింపు, పెండింగ్‌లో ఉన్న పనుల్లో పురోగతి, కొత్త పరిచయాల ద్వారా ప్రయోజనాలు దక్కుతాయి.

1. మేష రాశి (Aries)

మేష రాశి వారికి శని నక్షత్ర మార్పు ప్రయోజనకరంగా ఉండే అవకాశముంది. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం చేసే వారికి కొత్త అవకాశాలు దక్కుతాయి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో పురోగతికి అవకాశముంది. ఉద్యోగ రంగంలో తమ శ్రమ, అనుభవానికి తగిన గుర్తింపు లభిస్తాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి.

2. సింహ రాశి (Leo)

సింహ రాశి వారికి శనిదేవుడి ఈ నక్షత్ర మార్పు సమయం చాలా ప్రత్యేకంగా ఉండవచ్చని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి క్రమంగా ఉపశమనం లభించే అవకాశం ఉంది. ఉద్యోగ రంగంలో పరిస్థితులు మెరుగుపడుతాయి. మీరు చేసే పనికి ప్రశంసలు లభించడంతో ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉంది. చాలాకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలు కనిపిస్తాయి. అయితే రోజువారీ దినచర్య, బాధ్యతల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా ఉండటం మంచిది.

ఇవి కూడా చదవండి

3. మకర రాశి (Capricorn)

మకర రాశి వారికి శని నక్షత్ర సంచారం సానుకూల ఫలితాలను తీసుకొచ్చే అవకాశముంది. ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త మార్గాలు కనిపిస్తాయి. ఉద్యోగులు తమ కష్టానికి తగిన ఫలితాలను పొందే అవకాశం ఉంది. కార్యాలయంలో బాధ్యతలను సమర్థంగా నిర్వహించడం ద్వారా గుర్తింపు పొందుతారు. సహనం, పట్టుదలతో చేసే ప్రయత్నాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను అందిస్తాయి. కెరీర్, వ్యాపార రంగాల్లో ముందుకు వెళ్లేందుకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆలోచించి తీసుకునే నిర్ణయాలు విజయానికి తోడ్పడతాయి.

గమనిక: ఈ కథనంలోని రాశిఫలాలు జ్యోతిష్య నమ్మకాల ఆధారంగా అందించిన అంచనాలు మాత్రమే. వీటిని శాస్త్రీయంగా నిర్ధారితమైన ఫలితాలుగా పరిగణించకూడదు.

Follow Us