AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parivartan Yoga: పరివర్తన యోగం.. అదృష్టాలు పట్టబోయే రాశులివే..!

Guru Chandra Parivartan Yoga: అక్టోబర్ 16, 17, 18 తేదీల్లో గురు, చంద్రుల మధ్య ఏర్పడే పరివర్తన యోగం వల్ల ఆరు రాశుల వారికి శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉందని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. మేషం, మిథునం, కన్య, తుల, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్టం కలిసి రావడం, చేపట్టిన పనుల్లో విజయం, ఆర్థిక పురోగతి వంటి అనుకూల ఫలితాలు లభించవచ్చని భావిస్తున్నారు. ఈ మూడు రోజులను సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చని జ్యోతిష్య నమ్మకం.

Parivartan Yoga: పరివర్తన యోగం.. అదృష్టాలు పట్టబోయే రాశులివే..!
Guru Chandra Parivartan Yoga
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 09, 2026 | 7:37 PM

Share

జాతక చక్రంలో గానీ, గ్రహ సంచారంలో గానీ గురు, చంద్రుల మధ్య పరివర్తన జరగడం సాధారణ విషయం కాదని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ఈ రెండు గ్రహాల మధ్య రాశి పరివర్తన జరగడం తప్పకుండా జీవితాన్ని ఒక సానుకూల మలుపు తిప్పుతుందని ఈ శాస్త్రం చెబుతోంది. ఈ మూడు రోజుల పరివర్తన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. కొద్ది ప్రయత్నంతో తప్ప కుండా శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ నెల (అక్టోబర్) 16, 17, 18 తేదీల్లో చంద్రుడికి చెందిన కర్కాటక రాశిలో గురువు, గురువుకు చెందిన ధనూ రాశిలో గురువు సంచారం వల్ల ఈ పరివర్తన యోగం (Guru Chandra Parivartan Yoga) కలిగింది. మేషం, మిథునం, కన్య, తుల, వృశ్చికం, మీన రాశులకు అదృష్టాలు పట్టబోతున్నాయి.

మేషం

ఈ రాశికి చతుర్థ, భాగ్యస్థానాల అధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల ఈ రాశివారు ఆస్తి వివాదాలు, కోర్టు కేసుల పరిష్కారం మీద దృష్టి పెట్టడం వల్ల ప్రయోజనం పొందుతారు. నిరుద్యో గులు విదేశీ ఉద్యోగాలకు ప్రయత్నించడం మంచిది. విదేశాల్లో ఇప్పటికే వృత్తి, ఉద్యోగాల్లో ఉన్న వారు స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు విజయం సాధిస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధాల కోసం కృషి చేయడం మంచిది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది.

మిథునం

ఈ రాశికి ధన, సప్తమ స్థానాల మధ్య పరివర్తన జరగడం వల్ల ఏ విధమైన విదేశీ ప్రయత్నాలైనా లాభిస్తాయి. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా తరచూ విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. మొత్తం మీద విదేశీ సంపాదన యోగం పడుతుంది.. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. ఆదాయానికి లోటుండదు.

ఇవి కూడా చదవండి

కన్య

ఈ రాశికి చతుర్థ, లాభ స్థానాల మధ్య పరివర్తన జరగడం వల్ల ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. అనేక విధాలుగా సంపద వృద్ధి చెందుతుంది. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. బంధువుల్లో ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమై మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగులకు స్థిరత్వం కలుగుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లో ఉద్యోగం లభిస్తుంది.

తుల

ఈ రాశికి తృతీయ, దశమాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల కొద్ది ప్రయత్నంతో నిరుద్యోగు లకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీ ఉద్యోగం లభించడానికి కూడా అవకాశం ఉంది. ఆస్తి లాభం, భూలాభం కలుగుతాయి. సోదరులతో ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారమవుతుంది. బంధువుల్లో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు అపారంగా లాభిస్తాయి.

వృశ్చికం

ధన, భాగ్యాధిపతుల మధ్య పరివర్తన చోటు చేసుకున్నందువల్ల ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా తరచూ విదేశాలకు వెళ్లవలసి వస్తుంది. సంపన్న కుటుంబా నికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదురుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఒప్పందాలు కుదురుతాయి. ఉద్యోగంలో ఉన్నత పదవి లభిస్తుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది.

మీనం

పంచమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న రాశ్యధిపతి గురువుకు, దశమ స్థానంలో ఉన్న చంద్రుడికి మధ్య పరివర్తన జరగడం వల్ల ఈ రాశివారికి ప్రభుత్వంలో ఉన్నతోద్యోగం లభించే అవకాశం ఉంది. ఈ మూడు రోజుల పరివర్తన కాలంలో ఇందుకు సంబంధించిన ప్రయత్నాలకు శ్రీకారం చుట్టడం మంచిది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో రికార్డు స్థాయి విజయాలు సాధిస్తారు. విదేశీ అవకాశాలకు కూడా అవకాశం ఉంది. షేర్లు బాగా లాభిస్తాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది.

Follow Us