AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Poori Curry: అచ్చం హోటల్ స్టైల్ కమ్మటి పూరి కర్రీ.. పక్కా కొలతలతో సీక్రెట్ టిప్‌తో ఇలా చేసి చూడండి!

పూరీలకు బెస్ట్ కాంబినేషన్ అయిన హోటల్ స్టైల్ పూరి కర్రీని కొన్ని సింపుల్ టిప్స్‌తో ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఉల్లిపాయలను సరైన స్థాయిలో ఉడికించడం, శనగపిండితో చిక్కదనం తీసుకురావడం, చివర్లో నిమ్మరసం కలపడం ఈ రెసిపీలో ప్రధాన రహస్యాలు. బంగాళాదుంపతో కలిపి చేసిన ఈ బొంబాయి చట్నీ పూరీల రుచిని మరింత పెంచుతుంది.

Phani CH
|

Updated on: Aug 06, 2026 | 7:51 PM

Share
ఉదయం టిఫిన్లలో వేడి వేడి పూరీలకి సరైన కాంబినేషన్ 'పూరి కర్రీ'. దీనినే కొన్ని ప్రాంతాలలో 'బొంబాయి చట్నీ' అని కూడా పిలుస్తారు. హోటళ్లలో లభించే పూరి కూర ఎంతో చిక్కగా, ఉల్లిపాయల తీపితనంతో, అద్భుతమైన రుచితో ఉంటుంది. ఇంట్లో చేసినప్పుడు ఉల్లిపాయలు మరీ ముద్దగా అయిపోవడం లేదా రుచి పర్‌ఫెక్ట్‌గా రాకపోవడం వంటి సమస్యలు వస్తుంటాయి.

1 / 5
కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే హోటల్ కంటే రుచికరమైన పూరి కర్రీని నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఈ పూరి కర్రీ తయారీకి ముందుగా పాన్‌లో రెండు టీస్పూన్ల నూనె వేసి వేడిచేసి, అర టీస్పూన్ ఆవాలు వేసి చిటపటమనిపించాలి. ఆ తర్వాత ఒక టీస్పూన్ శనగపప్పు, ఒక టీస్పూన్ మినపప్పు వేసి సగానికి పైగా వేయించాలి.

2 / 5
ఆపై ముప్పావు టీస్పూన్ జీలకర్ర, రెండు ఎండుమిర్చి తరుగు, కరివేపాకు మరియు రెండు కారంగా ఉండే పచ్చిమిర్చి చీలికలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు పావు కిలో పొడవుగా రిబ్బన్లుగా తరిగిన ఉల్లిపాయలు, అర టీస్పూన్ పసుపు వేసి హై ఫ్లేమ్‌పై కేవలం 3 నిమిషాలు మాత్రమే వేయించాలి.

3 / 5
ఉల్లిపాయలను ఎక్కువగా వేయిస్తే కూర రుచి మారిపోతుంది. ఆ తర్వాత 500 ml నీళ్లు, సరిపడా ఉప్పు వేసి కలిపి మూతపెట్టి మీడియం ఫ్లేమ్‌పై 10 నుండి 12 నిమిషాలు ఉడికించాలి. ఉల్లిపాయలు ట్రాన్స్‌పరెంట్‌గా, పట్టుకుంటే సాఫ్ట్‌గా ఉండాలి కానీ ముద్దగా కాకూడదు.

4 / 5
వేరొక బౌల్‌లో రెండు టీస్పూన్ల శనగపిండిలో 50 ml నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉడికిన ఉల్లిపాయల మిశ్రమంలో ఈ శనగపిండి నీళ్లు, ఒక టీస్పూన్ అల్లం తరుగు వేసి కలిపి 2 నిమిషాలు ఉడికించి దగ్గరపడనివ్వాలి. ఆ తర్వాత ఒక పెద్ద ఉడికించిన బంగాళాదుంపను చిదిమి వేసి కలపాలి. చివరిగా స్టవ్ ఆప్ చేసి ఒక టీస్పూన్ నిమ్మరసం కలుపుకుంటే కమ్మటి హోటల్ స్టైల్ పూరి కర్రీ సిద్ధమవుతుంది.

5 / 5
Follow Us
అరటి తోటల్లో అలికిడి.. అడుగు ముందుకేసిన రైతుకు ఎదరైన భయానక దృశ్యం

శ్రావణ పౌర్ణమి: రాఖీ కట్టే రోజున ఈ పనులు చేయకండి!

సప్త సముద్రాలు ఈది.. పిల్ల కాలువలో తేలిపోయిన టీమిండియా

డిగ్రీ, డిప్లొమా మార్కులతో BEMLలో 1346 ఉద్యోగాలు.. రాతపరీక్ష లేదు

మిలాద్-ఉన్-నబీ స్పెషల్.. రైస్ ఖీర్‌ను ఇలా తయారు చేస్తే ఉంటాది..

పొయ్యి వెలిగించే పనిలేకుండా.. అమ్మమ్మల నాటి కమ్మని 'పొలం పచ్చడి'

ఏడాదికి 4 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ.. మీరూ పొందోచ్చు..

చుక్క నూనెతో 10 నిమిషాల్లో  వంకాయ తవా ఫ్రై

ప్రాణాల మీదకు తెచ్చిన పిల్లి.. హాస్పిటల్‌లో 10 మంది కూలీలు..

'బింబిసార' ఛైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా మారిపోయిందో చూశారా? ఫొటోస్