AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కెమికల్స్ అవసరం లేదు! 5 నిమిషాల్లో రాగి పాత్రలు మెరిపించే సీక్రెట్ ఫార్ములా ఫాలో అవ్వండి

రాగి పాత్రలు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమైనప్పటికీ, అవి త్వరగా మురికిగా మారతాయి. వాటిని శుభ్రం చేయడం చాలా కష్టం. అయితే, ఇంట్లో ఉండే గోధుమ పిండి, పసుపు, నిమ్మకాయ, ఉప్పు వంటి సహజ పదార్థాలతో మీ రాగి పాత్రలను నిమిషాల్లో కొత్తవిలా మెరిపించవచ్చు. ఈ సులువైన చిట్కాలతో గంటల శ్రమ లేకుండానే పాత్రలను తళతళలాడేలా చేసుకోవచ్చు, వాటి జీవితకాలాన్ని పెంచుకోవచ్చు.

కెమికల్స్ అవసరం లేదు! 5 నిమిషాల్లో రాగి పాత్రలు మెరిపించే సీక్రెట్ ఫార్ములా ఫాలో అవ్వండి
Copper Cleaning Tips
Jyothi Gadda
|

Updated on: Feb 27, 2026 | 6:10 PM

Share

రాగి పాత్రలు శతాబ్దాలుగా భారతీయ వంటగదిలో భాగంగా ఉన్నాయి. రాగి గ్లాసుల్లో నీరు తాగడం, రాగి పాత్రలలో వంట చేయడం శరీరానికి చాలా ప్రయోజనకరంగా భావిస్తారు. కానీ, ఈ రాగి పాత్రలు త్వరగా మురికిగా మారతాయి. శుభ్రం చేయడం కష్టం అవుతుంది. ప్రతిసారీ గంటల తరబడి రుద్ది రుద్ది తోమాల్సి వస్తుంది. దీంతో ఆ పాత్రలు పాతవాటిలా, నిస్తేజంగా కనిపిస్తాయి. అందుకే, మీ రాగి పాత్రలను కొత్తగా మెరిసేలా చేయడానికి కొన్ని సింపుల్‌ చిట్కాలు ఉన్నాయి. వాటితో మీ రాగిపాత్రలు నిమిషాల్లో మెరుస్తూ కనిపిస్తాయి. ఇందుకోసం మీ ఇంట్లో ఉన్న కేవలం నాలుగు పదార్థాలను ఉపయోగిస్తే సరిపోతుంది. ఖరీదైన కెమికల్స్ అవసరం లేకుండా కేవలం 5 నిమిషాల్లో రాగి పాత్రలను ఎలా శుభ్రం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

రాగి పాత్రలను శుభ్రం చేయడానికి, గోధుమ పిండి, పసుపు, నిమ్మకాయ, ఉప్పు అవసరం. ఒక చిన్న గిన్నెలో 2-3 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి తీసుకుని, దానికి అర టీస్పూన్ పసుపు పొడి వేసి, కొద్దిగా నిమ్మరసం వేసి, చిక్కటి పేస్ట్ లా కలపండి. ఈ పేస్ట్‌ను కంటైనర్ లోపల, వెలుపల మందంగా పూయండి. మురికి పూర్తిగా వదిలిపోవాలంటే..5-10 నిమిషాలు అలాగే ఉంచండి. ఇప్పుడు ఆ పాత్రను సున్నితంగా రుద్దండి. ఎక్కువ మరకలు, నల్లగా ఉంటే కొంచెం ఉప్పు చల్లి మళ్ళీ రుద్దండి. పాత్రపై గీతలు పడకుండా ఉండటానికి వృత్తాకారంలో కాస్త బలంగా రుద్దండి.

ఇప్పుడు గోరువెచ్చని నీటితో పాత్రను శుభ్రం చేసుకోండి. సబ్బు అవసరం లేదు. ఎందుకంటే, ముందుగా మనం తయారు చేసుకున్న పేస్ట్ మురికి, ఆక్సైడ్లను తొలగిస్తుంది. మంచినీటితో శుభ్రంగా కడిగిన తరువాత ..మరో శుభ్రమైన గుడ్డ లేదా కిచెన్ టవల్ తో పాత్రను క్లీన్‌గా తుడవండి. కావాలనుకుంటే, చివరిగా కొద్దిగా నిమ్మరసం, ఉప్పు కలిపి తుడవండి, తద్వారా అది మరింత మెరుస్తూ కనిపిస్తుంది. రాగి పాత్రలను ఉపయోగించిన వెంటనే కడిగి ఆరబెట్టండి. నెలకోసారి నిమ్మకాయ, ఉప్పుతో తేలికగా పాలిష్ చేయండి. తద్వారా అవి కొత్తవిలా మెరుస్తాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్