Srisailam: మల్లన్న భక్తులకు అలెర్ట్.. ఆ రోజు శ్రీశైల క్షేత్రం మూసివేత
చంద్ర గ్రహణం కారణంగా శ్రీశైల క్షేత్రంతో పాటు దాని ఉప ఆలయాలను మార్చి 3న మూసివేయనున్నారు. ఆ రోజున ఉదయం 6 గంటల నుంచి రాత్రి ఏడున్నర గంటల వరకు మూసివేయనున్నట్లు ఆలయ ఈవో ఓ ప్రకటనలో తెలిపారు. శ్రీశైలం దర్శనానికి వెళ్లే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసుకునేందుకు వీలుగా ఈ కీలక సూచనలు చేశారు.
నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయాన్ని మార్చి 3న మూసివేయనున్నారు. చంద్ర గ్రహణం ఏర్పడనున్న నేపథ్యంలో మార్చి 3న శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్ల దేవస్థానంలో పుణ్యక్షేత్రం ఆలయ ద్వారాలను మూసివేస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. చంద్రగ్రహణం ప్రభావంతో మార్చి 3వ తేదీన ఆలయ ద్వారాలను ఉదయం 6:00 గంటల నుండి రాత్రి 7:30 గంటల వరకు మూసివేస్తున్నట్లు వెల్లడించారు. ఆ మేరకు దేవస్థాన ఈవో భక్తులకు కీలక సూచనలు జారీ చేశారు. చంద్ర గ్రహణం కారణంగా ఆ రోజున నిర్వహించాల్సిన అన్ని ఆర్జిత సేవలు, పరోక్ష సేవలు, శ్రీస్వామి అమ్మవార్ల కల్యాణోత్సవ టికెట్లను పూర్తిగా రద్దు చేశారు. ప్రధాన ఆలయంతో పాటు సాక్షి గణపతి, హఠకేశ్వరం, ఫాలధార-పంచధార, శిఖరేశ్వరం వంటి ఉపాలయాలను కూడా మూసివేయనున్నారు. మార్చి 3 తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి సుప్రభాత సేవ, ప్రాతఃకాల పూజలు నిర్వహిస్తారు. కేవలం ఉదయం 4:30 నుండి 5:30 వరకు మాత్రమే భక్తులకు అలంకార దర్శనం కల్పిస్తానన్నారు. గ్రహణం అనంతరం రాత్రి 7:30 గంటలకు ద్వారాలు తెరిచి ఆలయ శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. తర్వాతే రాత్రి 9:00 గంటల నుండి 10:30 గంటల వరకు భక్తులకు తిరిగి దర్శన భాగ్యం కలుగుతుందని తెలిపారు. చంద్ర గ్రహణం కారణంగా ఆ రోజంతా అన్నప్రసాద వితరణ ఉండదని, భక్తులు ఈ మార్పులను గమనించి సహకరించాలని ఆలయ ఈవో ఏం.శ్రీనివాసరావు కోరారు.
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్ మెషీన్లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే

