అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే..
దుబాయ్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న కేరళకు చెందిన అబ్దుల్ రషీద్ ₹65 కోట్ల (25 మిలియన్ దిర్హమ్స్) బిగ్ టికెట్ లాటరీని గెలుచుకున్నారు. 26 మంది స్నేహితులతో కలిసి ఈ జాక్‌పాట్‌ను పంచుకున్నాడు. ఈ భారీ గెలుపు తర్వాత కూడా తాను డ్రైవర్‌గా కొనసాగుతానని తెలిపాడు. సాధారణ డ్రైవర్ జీవితం రాత్రికి రాత్రే మారిపోయి, అతని బృందానికి అపారమైన ఆనందాన్ని తెచ్చిన స్ఫూర్తిదాయక కథ ఇది.
అదృష్టం అనేది ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో ఎవరికి తెలియదు. డ్రైవర్‌గా క్యాబ్ నడుపుకునే ఓ వ్యక్తి .. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. పూట గడవడానికే ఇబ్బందిపడే అతడికి ఏకంగా 65 కోట్ల దుబాయ్ బంపర్ లాటరీ వచ్చింది. దీంతో అతడు.. అతడి కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దుబాయ్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న కేరళకు చెందిన 48 ఏళ్ల అబ్దుల్ రషీద్ ను అదృష్టం వరించింది. అబుదాబిలో నిర్వహించిన బిగ్ టికెట్ లాటరీ డ్రాలో ఏకంగా 25 మిలియన్ దిర్హమ్స్ అంటే సుమారు రూ. 65 కోట్లు గెలుచుకున్నారు. అయితే ఈ భారీ మొత్తాన్ని ఆయన ఒక్కరే కాదు, మరో 26 మందితో కలిసి పంచుకోనుండటం విశేషం. గత 17 ఏళ్లుగా దుబాయ్‌లో నివసిస్తూ ఓ ఎమిరాతీ కుటుంబం వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఆయన గత ఆరేళ్లుగా ప్రతినెలా తన స్నేహితులతో కలిసి బిగ్ టికెట్ లాటరీ కొంటూ వచ్చారు. మే 3వ తేదీన తీసిన సిరీస్ 265 డ్రాలో అబ్దుల్ రషీద్ బృందం ఏప్రిల్ 19న కొనుగోలు చేసిన టికెట్ నంబర్ 012318కు జాక్‌పాట్ తగిలింది. లాటరీ గెలిచిన విషయంపై అబ్దుల్ రషీద్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయం చాలా ఆనందాన్ని ఇచ్చిందని స్నేహితులతో ఉన్నప్పుడు ఈ విషయం తెలియడం మరింత ప్రత్యేకంగా అనిపించిందనీ తెలిపారు. మే 30న తన పుట్టినరోజు సందర్భంగా ఈసారి టికెట్‌ను తన పేరు మీద తీసుకున్నట్లు చెప్పారు. భారీ మొత్తం గెలుచుకున్నప్పటికీ, తాను డ్రైవర్‌గా కొనసాగుతానని అబ్దుల్ రషీద్ స్పష్టం చేశారు. ఈ ప్రైజ్ మనీని తమ బృందంలోని 27 మంది సభ్యులం పంచుకుంటామని, వీరంతా దుబాయ్‌లోని రషీదియాలో డ్రైవర్లు, టెక్నీషియన్లుగా పనిచేస్తున్నారని తెలిపారు. గెలుచుకున్న డబ్బును ఏం చేయాలనే విషయంపై కుటుంబ సభ్యులు, స్నేహితులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని అన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్!
ప్రాణాలను కాపాడిన.. రియల్ “హీరో” ఈ ఎలుక !!
దమ్ముంటే పట్టుకోరా షెకావత్.. అంటూ పోలీసులకు దొంగ సవాల్ !!
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్!
ప్రాణాలను కాపాడిన.. రియల్ "హీరో'' ఈ ఎలుక !!
దమ్ముంటే పట్టుకోరా షెకావత్.. అంటూ పోలీసులకు దొంగ సవాల్ !!
ఉబెర్ డ్రైవర్ నిజాయితీ.. నెటిజన్ల సెల్యూట్!
కోట్ల ఏళ్ల క్రితం మీ ఊరు ఎక్కడుందో చెప్పేసే ఆన్‌లైన్ టూల్
రెండేళ్ల పిల్లాడిని అడవిలో వదిలేసిన తండ్రి..కారణం ఇదే!

