మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్!
దక్షిణాఫ్రికాలోని కొమాటి నదిలో ఓ మొసలి కడుపులో మానవ అవశేషాలు, పలువురు వాడిన చెప్పులు బయటపడటం సంచలనం రేపింది. అదృశ్యమైన హోటల్ మేనేజర్ హత్యకు గురయ్యాడనే అనుమానాలు బలపడుతున్నాయి. మొసలిని పట్టుకుని పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు, డిఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటన మరిన్ని దాడులకు సూచనగా భావిస్తూ, ప్రజలను అప్రమత్తం చేశారు.
దక్షిణాఫ్రికాలోని కొమాటి నదిలో ఉండే ఓ మొసలి కడుపులో మానవ అవశేషాలు వెలికితీత సంచలనం రేపింది. హోటల్ మేనేజర్ అదృశ్యానికి అదే కారణమై ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు.. మొసలి కడుపులో ఒకటి రెండు కాదు.. ఏకంగా పలువురు వాడిన ప్లాస్టిక్ చెప్పులు బయటపడటం కేసు మిస్టరీని ఛేదించింది. దాంతో ఒక్కరు కాదు.. మరికొందరు మొసలి బారిన పడి ఉండొచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కొమాటి నదీ పరిసరాల్లో కనిపించిన ఈ మొసలిని పోలీసులు, అత్యవసర సేవల బృందాలు కొన్ని రోజుల పాటు ట్రాక్ చేశాయి. హెలికాప్టర్, డ్రోన్ల సాయంతో కదలికలను గమనించి చివరకు పట్టుకున్నారు. మరో దారి లేక దాని ప్రాణం తీయాల్సి వచ్చినట్లు అధికారులు తెలిపారు. మిస్సింగ్‌గా నమోదైన 59 ఏళ్ల వ్యాపారవేత్త కోసం గత వారం రోజులుగా గాలింపు కొనసాగుతోంది. అతని వాహనం వంతెన వద్ద చిక్కుకుపోగా అతని ఆచూకీ లభించలేదు. అదే ప్రాంతంలో తిరుగుతున్న మొసలిపై అనుమానం రావడంతో దానిని లక్ష్యంగా చేసుకున్నారు. చనిపోయిన మొసలిని నీటి నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు. దాని కడుపులో మానవ అవశేషాలు బయటపడ్డాయి. అవి అదృశ్యమైన మేనేజర్‌వేననే అనుమానం వ్యక్తమవుతున్నా, డీఎన్‌ఏ పరీక్షల ద్వారా పూర్తి స్థాయిలో నిర్ధారణ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. ఆశ్చర్యకర విషయం ఏమిటంటే.. మొసలి కడుపులో సుమారు ఆరు జతల చెప్పులు బయటపడటం. ప్లాస్టిక్ పదార్థాలు జీర్ణం కాకపోవడం వల్ల అవి అలాగే మిగిలిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ చెప్పులు గతంలో మరికొందరు బాధితులకు చెందినవే అయి ఉండొచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో మొసళ్ల ఉనికి, వాటి దాడులపై భయాందోళనలు పెరిగాయి. నీటి వనరుల దగ్గర ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఒక హోటల్ మేనేజర్ అదృశ్యం నుంచి మొదలైన కేసు.. ఇప్పుడు మరిన్ని అనుమానాలకు తావిస్తూ సంచలనంగా మారింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రాణాలను కాపాడిన.. రియల్ “హీరో” ఈ ఎలుక !!
దమ్ముంటే పట్టుకోరా షెకావత్.. అంటూ పోలీసులకు దొంగ సవాల్ !!
ఉబెర్ డ్రైవర్ నిజాయితీ.. నెటిజన్ల సెల్యూట్!
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్!
ప్రాణాలను కాపాడిన.. రియల్ "హీరో'' ఈ ఎలుక !!
దమ్ముంటే పట్టుకోరా షెకావత్.. అంటూ పోలీసులకు దొంగ సవాల్ !!
ఉబెర్ డ్రైవర్ నిజాయితీ.. నెటిజన్ల సెల్యూట్!

