AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి..

రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి..

Phani CH
|

Updated on: May 08, 2026 | 12:49 PM

Share

ప్రజా ఆస్తుల ధ్వంసం, దుర్వినియోగంపై రెండు వైరల్ ఘటనలు వెలుగుచూశాయి. సింగపూర్‌లో ఫ్రెంచ్ యువకుడు వెండింగ్ మెషిన్ స్ట్రాను నాకి తిరిగి పెట్టగా, భారత రైలులో సీట్లను కొందరు బ్లేడ్‌లతో కోసేశారు. ఈ చర్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. రెండు చోట్లా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి, నిందితులకు కఠిన శిక్షలు పడే అవకాశం ఉంది. ప్రజా ఆస్తులను రక్షించాల్సిన అవసరాన్ని ఈ ఘటనలు గుర్తుచేస్తున్నాయి.

సింగపూర్‌లో ఉంటున్న ఓ ఫ్రెంచ్ కుర్రాడు ఆరెంజ్‌ జ్యూస్‌ వెండింగ్ మెషీన్‌ వద్ద చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. అతను వెండింగ్‌ మెషీన్‌ నుంచి స్ట్రాను తీసి నాకి, ఎంగిలి చేసి తిరిగి ఆ మెషీన్‌లోనే పెట్టాడు.ఆ కుర్రాడు చేసిన పనివల్ల తర్వాత వచ్చే కస్టమర్లు అదే స్ట్రాతోనే ఆరెంజ్‌ జ్యూస్‌ తాగే ప్రమాదం ఏర్పడింది. దీంతో వెండింగ్‌ మెషీన్‌ వద్ద ఆ కుర్రాడు చేసిన ఆ పనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. దీంతో.. అతనిపై నెటిజన్ల నుంచి తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఈ వెంటనే అతడిపై క్రిమినల్‌ కేసు కూడా నమోదైంది. ఇతరుల ఆస్తికి సంబంధించి ఉద్దేశపూర్వక నష్టం కలిగించే చర్య, పబ్లిక్ న్యూసెన్స్ ఆరోపణలను ఆ ఫ్రెంచ్ యువకుడు ఎదుర్కొన్నాడు. ఆ కుర్రాడి పేరు డిడియర్ గాస్పార్డ్. మార్చి 12న సింగపూర్‌లోని ఓ షాపింగ్ మాల్‌లో అతడు ఆ చర్యకు పాల్పడినట్లు తెలిసింది. అతని చర్యకు గానూ ఏప్రిల్ 24న అతనిపై కేసు నమోదైంది. దీంతో అతడు.. సింగపూర్‌ నుంచి వేరే ఏ దేశానికి వెళ్లాలన్నా కోర్టు నుంచి ముందుగానే పర్మిషన్‌ తీసుకోవాలి. మే 2 నుంచి 25 వరకు సర్టిఫికెట్‌ కోసం పాఠశాలకు వెళ్లా‍ల్సి ఉండడంతో మనీలా వెళ్లేందుకు ఆ కుర్రాడికి కోర్టు అనుమతి ఇచ్చింది. మే 29న మళ్లీ కోర్టులో అతను హాజరు కావాల్సి ఉంది. వెండింగ్‌ మెషీన్‌ వద్ద అతను చేసిన పనికి గరిష్ఠంగా 2 సంవత్సరాల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ పడే అవకాశం ఉంది. ఈ ఘటన తర్వాత.. అక్కడ జ్యూస్ వెండింగ్ మెషీన్‌ను నిర్వహించే ఐజూజ్ సంస్థ..ఆ మెషీన్‌ను శుభ్రపరిచి, అందులోని 500 స్ట్రాలను మార్చింది. మన దేశంలో రెండు నెలల క్రితం రైలు బోగీలో సీట్‌ కవర్లను కొందరు అగంతకులు బ్లేడ్స్‌తో కోసేశారు. కమలా గంగా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో కొందరు అగంతకులు సీట్‌ కవర్లను బ్లేడ్‌తో కోసి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి రాక్షసానందం పొందారు. రైల్లోని ఓ ప్యాసెంజర్ ఈ దృశ్యాలు చూసి షాకై వీడియో తీసి పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. సీట్ల కవర్లను కావాలనే కోసినట్టు వీడియోల్లో స్పష్టంగా కనిపించింది. అగంతకుల చర్యలతో పలు సీట్లు దెబ్బతిన్నాయి. సీట్లపై కవర్లు చిరిగిపోవడంతో లోపలి కుషన్, మెటల్ ఫ్రేమ్స్ బయటకు కనిపించాయి. బోగీలోని సీట్లన్నీ పాడయ్యాయి. ఇక ఈ వీడియోపై నెట్టింట విమర్శలొచ్చాయి. పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కావని అన్నారు. జరిగిన నష్టాన్ని వారితోనే భర్తీ చేయించాలనీ డిమాండ్ చేశారు. బోగీల్లోపల కూడా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తే ఇలాంటి ఘటనలు జరగవని అన్నారు. రైల్వే ఆస్తులను ధ్వంసం చేసిన వారికి రైల్వే యాక్ట్- 1989 ప్రకారం, ఐదేళ్ల వరకూ శిక్ష పడే అవకాశం ఉంది. తీవ్రమైన నేరాల్లో కోర్టులు యావజ్జీవ శిక్ష కూడా విధించే ఛాన్స్ ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు

‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే

అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే..

మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!

ప్రాణాలను కాపాడిన.. రియల్‌ “హీరో” ఈ ఎలుక !!

Follow Us