నష్టాల్లో ఉన్న ఇండోర్ మెట్రో ఆదాయాన్ని పెంచుకోవడానికి వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇకపై మెట్రో రైలులో పుట్టినరోజు పార్టీలు, ప్రీ-వెడ్డింగ్ షూట్లు, కిట్టీ పార్టీలు నిర్వహించుకోవచ్చు. కదులుతున్న కోచ్‌కు గంటకు ₹7,000, నిలిచి ఉన్న కోచ్‌కు ₹5,000 ఛార్జీలు, ₹20,000 సెక్యూరిటీ డిపాజిట్‌గా నిర్ణయించారు. మద్యం, ధూమపానం నిషేధం.