కేరళ కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన ఓ ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికైన బిందు కృష్ణను కౌగిలించుకునేందుకు సీనియర్ నేత చెరియన్ ఫిలిప్ ప్రయత్నించగా, ఆమె అసౌకర్యానికి గురై ఆయన్ను పక్కకు నెట్టి ముందుకు వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.