పాలకూరతో లభించే ప్రయోజనాలు అన్నీఇన్నీ కావు. దీంతో లభించే ఇనుము, మెగ్నీషియం, విటమిన్ కె, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, బీ2, బీ6 మన కళ్లు ఆరోగ్యంగా ఉండటానికి దోహదపడతాయి
TV9 Telugu
శరీరంలో వాపును తగ్గిస్తాయి. ఇంకా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. కిడ్నీలో రాళ్లు ఏర్పడే పరిస్థితి గలవారు పాలకూరను మితంగా తీసుకోవాలి
TV9 Telugu
ముఖ్యంగా ఆక్సలేట్స్ ఉత్పత్తి ఎక్కువై... అది మూత్రంలోని కాల్షియంతో కలిసినప్పుడు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. వీటిని కాల్షియం ఆక్సలేట్స్ అంటారు
TV9 Telugu
పాలకూరలో ఆక్సలేట్ ఉంటుంది. కానీ దీన్ని తినడం వల్లే రాళ్లు వస్తాయన్న భావన సరికాదు. పాలకూరే కాదు కాఫీ, జీడిపప్పు, పిస్తా, వేరుశనగ లాంటివి తిన్నా కిడ్నీలో రాళ్లు వస్తాయని వీటికి దూరంగా ఉంటారు కొంతమంది
TV9 Telugu
ఇవన్నీ అపోహలే. మితంగా, శరీరానికి కావాల్సినమేర ఏ ఆహారాన్ని తిన్నా... అనారోగ్య సమస్యలేవీ రావు. అతిగా అవసరానికి మించి తినడం వల్లే సమస్యంతా
TV9 Telugu
అయితే మధుమేహం, స్థూలకాయం లాంటి దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. ఇలాంటివాళ్లు ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు
TV9 Telugu
శరీరం ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకోవాలి. రోజుకి రెండుమూడు లీటర్ల నీళ్లను తాగాలి. కర్బూజ, కీర వంటి నీళ్లు అధికంగా ఉండే పండ్లను తినాలి
TV9 Telugu
ఆక్సలేట్స్ అధికంగా ఉండే పదార్థాల్ని తినేటప్పుడు పాలు, పాల సంబంధిత పదార్థాలు కలిపి, వండుకుని తింటే మంచిది. వీటిల్లో ఉండే కాల్షియం ఆక్సలేట్స్‌ను గ్రహిస్తుంది. దాంతో కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం తక్కువ