Telangana: ఉద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్.. అకౌంట్లలో డబ్బులు జమ!
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం అదరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. గత కొన్నేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులను విడుదల చేసింది. ఈ మేరకు రూ.745 కోట్ల పెండింగ్ బిల్లులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి ఆదేశాలతో విడుదల చేసింది.

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ స్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రభుత్వం నుంచి ఉద్యోగాలకు రావాల్సిన నిధులు విడుదల విషయంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల సందర్భంగా చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న నిధులను దశల వారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి ఆదేశాల మేరకు ఆర్థిక శాక పెండింగ్‌లో ఉన్న రూ.745 కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పెండింగ్ బిల్లులను విడతల వారీగా క్లియర్ చేస్తామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకుంది.
ఇక తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో ఉద్యోగులకు భారీ ఊరట లభించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో మాదిరి కాకుండా ప్రతి నెలా పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడంతో తమపై కూడా ఆర్థిక భారం తగ్గుతుందని ఉద్యోగులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..
గ్రామాల్లో పెండింగ్ బిల్లులకు నిధుల విడుదల
ఇదిలా ఉండగా గ్రామాల్లోని పెండింగ్ బిల్లల కోసం కూడా ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. తాజాగా జరిగిన ఎన్నికల తర్వాత గ్రామాల్లో కొత్త పాలక వర్గాలు ఏర్పాటు అయ్యాయి. దీంతో గ్రామాల అభివృద్ధి కోసం ఇటీవలే కేంద్రం నిధులు విడుదల చేయగా.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రామాల్లో ఉన్న పెండింగ్‌లో ఉన్న బకాయిల చెల్లింపు కోసం, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్య నిర్వహణ కోసం అదనంగా రూ.389 కోట్లను విడుదల చేసింది. ఈ నిధుల విడుదలతో గ్రామాల్లోని పెండింగ్‌లో ఉన్న పలనులు ఊపందుకోనున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
