AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘రోడ్లు ఊడ్చే స్వీపర్ల నెల జీతం రూ.2 లక్షలు.. IAS, గవర్నర్ల కంటే వీళ్ల జీతాలే ఎక్కువ’.. వేతన సవరణ చట్టంతో కొత్త చిక్కులు

రాష్ట్రంలో సీనియర్‌ స్వీపర్ల నెల జీతం రూ.2 లక్షలకు పెరిగిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ రావు అన్నారు. వరుసగా వేతన సవరణ కమిషన్లు (PRCS) అమలు కారణంగా తెలంగాణ విద్యుత్ సంస్థల్లో 20 సంవత్సరాల అనుభవం ఉన్న సీనియర్ స్వీపర్ల సంపాదన ఈ మేరకు పెరిగినట్లు ఆయన వెల్లడించారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులపై సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు..

'రోడ్లు ఊడ్చే స్వీపర్ల నెల జీతం రూ.2 లక్షలు.. IAS, గవర్నర్ల కంటే వీళ్ల జీతాలే ఎక్కువ'.. వేతన సవరణ చట్టంతో కొత్త చిక్కులు
Telangana Govt Employees Salaries
Srilakshmi C
|

Updated on: Feb 27, 2026 | 12:56 PM

Share

హైదరాబాద్‌, ఫిబ్రవరి 27: 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు రూ.1600 కోట్లుగా ఉన్న పెన్షన్లు జీతాల బిల్లు.. గత పదేళ్లలో నాలుగు రెట్లు పెరిగి ఇప్పుడు రూ.6,000 కోట్లకు చేరిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ రావు అన్నారు. వేతన సవరణ కమిషన్ల సిఫార్సుల అమలుతో కొన్ని విద్యుత్‌ సంస్థల్లో సీనయిర్ స్వీపర్ల జీతం నెలకు రూ.2 లక్షలకు పెరిగిందని అన్నారు. ఇక విద్యుత్ సంస్థల చీఫ్ ఇంజనీర్ల జీతం రూ.7 లక్షలకు చేరుకుంటుందని ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ రావు పేర్కొన్నారు. వరుస వేతన సవరణల కారణంగా జీతం, పెన్షన్ వ్యయం 300 శాతం పెరిగడంతో స్థిర వ్యయం గణనీయ స్థాయికి చేరిందని ఆయన అన్నారు. ఆశ్చర్యమేమంటే.. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఇప్పుడు IAS అధికారులు, గవర్నర్ కంటే చాలా ఎక్కువగా ఉన్నాయని అన్నారు. ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి సవరించడం వల్ల విద్యుత్ సంస్థల్లో జీతాలు తులనాత్మకంగా ఎక్కువగా ఉన్నాయన్నారు.

ప్రభుత్వ ఉద్యోగాలకు ఉన్న ఈ అధిక జీతాలు ఉద్యోగాల పోటీని మరింత తీవ్రతరం చేశాయనడానికి ఇటీవల ప్రకటించిన 563 గ్రూప్1 పోస్టులను ఉదాహరణగా చెప్పారు. ఈ పోస్టులకు దాదాపు నాలుగున్నర లక్షల మంది అభ్యర్థులు పోటీ పడ్డారని ప్రధాన కార్యదర్శి అన్నారు. అన్ని వర్గాల అభ్యర్థులు యేళ్లతరబడి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపరేషన్‌ సాగిస్తున్నారు. ఇది వృద్ధి చెందుతున్న కోచింగ్ పరిశ్రమకు ఆజ్యం పోస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తెలంగాణ ప్రభుత్వం బలమైన ఆర్థిక పనితీరు వల్ల వ్యయాన్ని భరించి, దాదాపు 11% వృద్ధిని,ఆదాయ వనరులలో స్థిరమైన పెరుగుదలను చూపుతున్నట్లు వెల్లడించారు. సబ్సిడీల కోసం బలమైన డిజిటల్ మౌలిక సదుపాయాలను సృష్టించామని, రైతు బంధు కింద రూ. 7,000 కోట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో కేవలం 6% మాత్రమే Error రేటు ఉందని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి 10 సంవత్సరాలలో ప్రభుత్వం దాదాపు రూ.15 లక్షల కోట్లు ఖర్చు చేసింది. అందులో దాదాపు రూ.12 లక్షల కోట్లు జీతాలు, పెన్షన్లు, రుణ చెల్లింపుల కోసమే వెచ్చించినట్లు తెలిపారు. దాదాపు రూ.3 లక్షల కోట్లు మూలధన వ్యయంకి వెళ్లాయి. ఆస్తుల అమ్మకాల ద్వారా దాదాపు రూ.15,000 కోట్లు మాత్రమే ఉత్పత్తి  వచ్చింది.

అయితే తెలంగాణ రాష్ట్రానికి సొంత వనరులు, పన్నుల వృద్ధి ఉందని కూడా ఆయన అన్నారు. గతంలో రాష్ట్రానికి సొంత వనరులు లేకపోవడం వల్ల అప్పులు తీసుకోవాల్సి వచ్చేదని ఆయన అన్నారు. ఆర్థిక కమిషన్ నివేదిక ఆర్థిక ఏకీకరణ, బడ్జెట్ వెలుపల రుణాలు, రాష్ట్ర స్థాయిలో పెరుగుతున్న సబ్సిడీల భారంపై ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తిందని ఆయన అన్నారు. ముఖ్యంగా తెలంగాణ వంటి రాష్ట్రాల్లో బడ్జెట్ వెలుపల రుణాలను అరికట్టాల్సిన అవసరాన్ని, నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను లాభదాయకంగా మార్చడానికి వినూత్న పద్ధతులను అనుసరించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. విచక్షణారహిత సబ్సిడీ పథకాలు మూలధన వ్యయం, దీర్ఘకాలిక అభివృద్ధిపై కలిగించే ఒత్తిళ్ల గురించి ఆయన ఈ సమావేశంలో మాట్లాడారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us