AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీదేవితో ఉన్న చిన్నారిని గుర్తుపట్టారా.? 90’స్ కిడ్స్ ఫేవరెట్ హీరోయిన్ ఆమె.. ఇప్పటికీ అదే అందం

తెలుగు సినిమాల్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా వెలిగిన తారలు చాలా మంది ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్స్ అయినవారి గురించి అసలు చెప్పక్కర్లేదు. రీసెంట్ డేస్ లో యంగ్ హీరోయిన్స్ దూసుకుపోతున్నారు. కొంతమంది సీనియర్ హీరోయిన్స్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తున్నారు.

శ్రీదేవితో ఉన్న చిన్నారిని గుర్తుపట్టారా.? 90'స్ కిడ్స్ ఫేవరెట్ హీరోయిన్ ఆమె.. ఇప్పటికీ అదే అందం
Sridevi
Rajeev Rayala
|

Updated on: Aug 13, 2026 | 7:16 PM

Share

సినిమా పరిశ్రమలో ఉన్న అగ్రకథానాయికలలో ముందు వరసలో ఉండే నటి శ్రీదేవి. అప్పట్లో చిత్రపరిశ్రమలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న తార కూడా ఆమెనే. ఆమె అందం ఆమె అభినయం ప్రేక్షకులను ఉర్రుతలూగించింది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఎన్నో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఆపై కథానాయికగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. 2018 ఫిబ్రవరి 24న 54 ఏళ్ల వయసులోనే అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. శ్రీదేవి మరణం సినీ పరిశ్రమకు ఎప్పటికీ తీరని లోటును మిగిల్చింది. శ్రీదేవి ఎంతో మంది హీరోలతో కలిసి సినిమాలు చేశారు. అలాగే ఆమె కొంతమంది హీరోయిన్స్ కాంబినేషన్ లోనూ నటించారు. ఇక పై ఫోటో గమనించారా.? ఆ ఫొటోలో శ్రీదేవితో ఉన్న చిన్నారి ఎవరో తెలుసా.?

ఇది కూడా చదవండి: అమ్మబాబోయ్..! మేడం ఇది మీరేనా..!! సింధుతులాని ఇప్పుడు ఎంత మారిపోయింది

శ్రీదేవితో ఉన్న చిన్నారి టాలీవుడ్ లో తోప్ హీరోయిన్.. చేసింది కొన్ని సినిమాలే అయినా కుర్రాళ్లను కిర్రెక్కించింది. ఆమె ఎవరో కనిపెట్టండి చూద్దాం.! 90స్ కిడ్స్ ఫేవరెట్ హీరోయిన్ ఆమె.. ఆ చిన్నారి మరెవరో కాదు ఒకప్పడు ఆకట్టుకున్న మహేశ్వరి. 1995లో అమ్మాయి కాపురం సినిమాతో తెలుగు తెరకు పరియమైంది ఈ క్యూట్ హీరోయిన్. ఆ తర్వాత జెడీ చక్రవర్తి నటించిన గులాబీ సినిమాలో మరోసారి కనిపించింది. ఈ మూవీ అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. దీంతో మహేశ్వరికి ఫుల్ ఫాలోయింగ్ వచ్చేసింది. అప్పట్లో ఆమె నటనకు.. క్యూట్ ఎక్స్ ప్రషన్స్ యూత్ లో యమ ఫాలోయింగ్ ఉండేది. తెలుగులో దెయ్యం, మృగం, జాబిలమ్మ పెళ్లి చిత్రాల్లో నటించి అలరించింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :అయ్యో.. ఫోన్ ఎంతపని చేసింది..!! హాస్పటల్ పాలైన అందాల నటి.. కారణం తెలిస్తే షాక్ ఆడుతారు

పెళ్లి సినిమా మహేశ్వరి కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచింది. ప్రియరాగాలు, వీరుడు, నవ్వులాట, నీకోసం సినిమాల్లో కనిపించనుంది. 2003 నుంచి 2014లో తెలుగు, తమిళ సినిమాల్లో నటించింది. మహేశ్వరి చివరిసారిగా తిరుమల తిరుపతి వెంకటేశా సినిమాలో కనిపించింది. ఆ తర్వాత సినిమాల నుంచి దూరమయ్యింది. కాగా మహేశ్వరి శ్రీదేవి బంధువులు అవుతారు. మహేశ్వరికి శ్రీదేవి మేనత్త అవుతారు. ఇప్పటికీ మహేశ్వరి శ్రీదేవి పిల్లలకు తోడుగా ఉంటున్నారు. ఇక మహేశ్వరి ఇప్పటికీ తరగని అందంతో ఆకట్టుకుంటున్నారు.

ఇది కూడా చదవండి :జెన్ జీలకు తెగ నచ్చేసిన సినిమా ఇదే.. ఒక్కసారి చూస్తే మీరూ వదిలిపెట్టారు.!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us