ఉడికించిన కోడి గుడ్డు ఎన్ని రోజులు నిల్వ చేసుకోవచ్చునో తెలుసా?
Samatha
13 August 2026
కోడి గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే వైద్య నిపుణులు, చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ రోజుకు ఒక గుడ్డు తినాలి అంటారు.
ప్రతి రోజూ ఒక ఉడికించిన కోడి గుడ్డు తినడం వలన ఇది శరీరానికి కావాల్సిన ప్రోటీన్ అందించడమే కాకుండా రోగనిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది.
అంతే కాకుండా శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది. అయితే చాలా మందిలో దీని విషయంలో ఒక డౌట్ ఉంటుంది. అది ఏమిటంటే?
ఉడికించిన కోడి గుడ్డు ఎన్ని రోజుల వరకు తాజాగా ఉంటుంది? దీనిని ఎన్ని రోజుల వరకు తినవచ్చు? కాగా, ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం.
ఉడికించిన కోడి గుడ్డు, రిఫ్రిజిరేటర్ లో వారం రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
అయితే దానిపై ఉండే సహ పొర మాత్రం తొలిగిపోతుందంట. ఇక బ్యాక్టీరియా చేరకూడదంటే రిఫ్రిజిరేటర్‌లో మాత్రమే స్టోర్ చేయాలంట.
పెంకులు తీయని కోడి గుడ్డు అయితే గాలి చొరబడని డబ్బాలో పెట్టి నాలుగు నుంచి ఐదు రోజుల వరకు అందులో స్టోర్ చేసుకోవచ్చునంట.
పెంకులు తీసిన కోడి గుడ్డును,పేపర్‌లో చుట్టి ఒక్క రోజు నిల్వ ఉంచవచ్చును. అయితే దీని విషయంలో తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుందంట.