చాణక్య నీతి : స్త్రీలు ఎవరికీ చెప్పకూడని రహస్యాలు ఇవే.. చెబితే ఖతమే
Samatha
9 August 2026
ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన నేటి తరం వారికి ఉపయోగపడే అనేక అంశాల గురించి తెలియజేసిన విషయం తెలిసిందే.
అదే విధంగా చాణక్యుడు, స్త్రీలకు సంబంధించిన, అనేక అంశాల గురించి, తన చాణక్యనీతి అనే పుస్తకంలో చాలా గొప్పగా వివరంగా తెలియజేయడం జరిగింది.
అలాగే చాణక్యుడు, మహిళలు కొన్ని విషయాలను అస్సలే ఇతరులతో పంచుకోకూడదు. ఒక వేళ పంచుకుంటే, అది మీకు అనేక సమస్యలను తీసుకొచ్చే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చాడు. అవి ఏవి అంటే?
చాణక్య నీతి ప్రకారం, స్త్రీలు ఎప్పుడూ కూడా కుటుంబ వివాదాలు, వ్యక్తిగత విషయాలను ఎట్టి పరిస్థితుల్లో ఇతరులతో పంచుకోకూడదంట, పంచుకుంటే ఎగతాళి చేసే ఛాన్స్ ఉన్నదంట.
అంతే కాకుండా, భార్య భర్తల బంధం పూర్తిగా ప్రేమ, నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. అందువలన భర్త లోపాలను ,బలహీనతలను ఇతరులతో పంచుకోకూడదంట.
అంతే కాకుండా మీ పొదుపులు, బ్యాంకు బ్యాలెన్స్ గురించి కూడా ఎప్పటికీ, స్త్రీలు ఇతరులతో చర్చించకూడదు అని చెబుతున్నాడు ఆచార్య చాణక్యుడు.
మీకు ఎక్కడైనా అవమానం జరిగినా లేదా మీరు బాధకు గురి అయినట్లు అయితే, అటువంటి విషయాలను కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇతరులతో పంచుకోకూడదంట.
అలాగే భవిష్యత్తు ప్రణాళికల గురించి, మీ రహస్యాల గురించి కూడా అస్సలే ఎదుటి వారికి చెప్పకూడదు, అని చెబుతున్నాడు ఆచార్య చాణక్యుడు. పెద్ద ప్రణాళికలు అస్సలే చెప్పకూడదంట.