సోషల్ మీడియాలో ట్రెండ్.. బ్లాక్ చీరలో హీటెక్కిస్తున్న సీరియల్ బ్యూటీ

Samatha

13  August 2026

అందాల చిన్నది అమూల్య గౌడ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.

ఈ అమ్మడు బుల్లితెరపైకి అడుగు పెట్టిన అతికొద్ది సమయంలో మంచి గుర్తింపు సంపాదించుకుంది. తన అందంతో అందరినీ ఆకట్టుకుంటుంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ఈ ముద్దుగుమ్మ పేరే వినిపిస్తుంది. యూత్ ఫేవరెట్ బ్యూటీ అయిపోయింది.

ముఖ్యంగా ఈ చిన్నది గుండె నిండ గుడి గంటలు సీరియల్‌తో మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఈ సీరియల్‌లో తన నటనతో అందరి మనసు దోచేసుకుంటుంది.

ఇక గత కొన్ని రోజుల నుంచి ఈ ముద్దుగుమ్మ లవ్‌లో ఉన్నట్లు గుస గుసలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు దానిపై ఓ క్లారిటీ వచ్చింది.

ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ హీరో నిరంజన్‌తో అమూల్య గౌడ ప్రేమలో ఉన్నట్లు గుస గుసలు వినిపించగా, వారి ప్రేమను వీరు అధికారికంగా ఈవెంట్ ద్వారా అభిమానులకు తెలియజేశారు.

దీంతో ఈ ముద్దుగుమ్మ మరింత ట్రెండ్ అయిపోయింది. ఇక ఎక్కడ చూసినా సరే ఈ అమ్మడు గురించే వినిపిస్తుంది, ఈ బ్యూటీ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ చీరలో ఉన్న ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అందులో ఈ ముద్దుగుమ్మ అందానికి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు.