పంచభక్ష్య పరమన్నాలు అంటే ఏంటో తెలుసా?
Samatha
13 August 2026
చాలా మంది పంచ భక్ష్య పరమన్నాలు కావాలా అంటారు. దీంతో చాలా మంది అసలు పంచ భక్ష్య పరమన్నాలు అంటే ఏంటి అనే ఆలోచిస్తుంటారు.
కానీ చాలా మందికి దీని గురించి తెలియదు. కాగా, ఇప్పుడు మనం పంచభక్ష్య పరమన్నాలు అంటే ఏంటి? దీని గురించి వివరంగా తెలుసుకు
ందాం.
పూర్వకాలంలో ఇంటికి వచ్చే అతిథులకు పంచభక్ష్య పరమన్నాలు వడ్డిచే వారంట. ఇది తెలుగు సంప్రదాయం. అయితే అవి ఏవి అంటే?
పంచ అంటే ఐదు రకాలు, అందులో ఒకటి , భక్ష్యం..అంటే చేతితో పట్టుకొని కొరికి తినేది. అప్పడం, లడ్డూ, గారె లాంటివి.
రెండవది,భోజ్యం ఆహారం. నోటితో నమిలి తినేదానిని భోజ్యం అంటారు. తెల్లటి అన్నం, పులిహోర, కిచిడిలాటివి భోజ్యం.
మూడవది లేహ్యం. అంటే నాలుకతో రుచి చూసే వాటిని లేహ్యం అంటారు. ఇందులో తేనె, స్వీట్, పచ్చళ్లు లాంటి ఆహారాలు.
నాలుగోది చోష్యం, అంటే నోటితో జుర్రుతూ తినేవి. పచ్చి పులుసు, సాంబార్, రసం, పప్పు చారు వంటి ఆహారాలు చోష్యం
కిందకు వస్తాయి.
ఐదవది పానీయం. మజ్జిగ, కూల్ డ్రింక్స్, టీ, పాలు, పండ్ల రసాలు. ఇవన్నీ వడ్డించి పెట్టడాన్ని పంచభక్ష్య పరమన్నాలు అంటారంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
మనుషుల్లా విడాకులు తీసుకునే పక్షులు.. వీటి ప్రేమ కథ తెలుసా!
జీవితంలో ఒకసారే వికసించి, మరణించే అద్భతమైన మొక్కలివే ఇవే!
చాణక్య నీతి : స్త్రీలు ఎవరికీ చెప్పకూడని రహస్యాలు ఇవే.. చెబితే ఖతమే