ఒకప్పుడు సెన్సేషనల్ హీరోయిన్.. ఇప్పుడు తెలుగులో ఆఫర్స్ కరువు..
Rajitha Chanti
Pic credit - Instagram
13 August 2026
దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా వచ్చిన 'సీతా రామం' చిత్రంతో తెలుగు సినీ రంగానికి పరిచయమై మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది మరాఠీ భామ మృణాల్ ఠాకూర్.
హిందీ బుల్లితెర నుంచి వెండితెరకు అడుగుపెట్టిన ఈ భామ, తెలుగులో మొదటి చిత్రంలోనే 'సీతా మహాలక్ష్మి' పాత్రలో నటించి ఓవర్‌నైట్ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది.
మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న మృణాల్, ఆ తర్వాత వరుస అవకాశాలను అందుకుంది. తక్కువ సమయంలోనే పాపులర్ అయ్యింది.
'సీతా రామం' గ్రాండ్ సక్సెస్ తర్వాత నాని సరసన నటించిన 'హాయ్ నాన్నా' చిత్రంతో మృణాల్ మరొక హిట్ కొట్టింది. ఈ రెండు సినిమాల విజయాలతో స్టార్ డమ్ అందుకుంది.
అయితే, ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన నటించిన 'ఫ్యామిలీ స్టార్' చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్లాప్‌గా నిలవడం.. తర్వాత ఆమె తెలుగులో సినిమాలు చేయలేదు.
అనంతరం వచ్చిన 'డెకాయిట్' సినిమాలో తన నటనకు మంచి గుర్తింపు లభించినప్పటికీ, ఆ చిత్రం సగటు విజయాన్ని మాత్రమే సాధించింది.
మధ్యలో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా చిత్రం 'కల్కి 2898 AD'లో చిన్న స్పెషల్ రోల్‌లో కనిపించినా, అది పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.
ఇక బాలీవుడ్‌లోనూ వరుసగా కొన్ని ఫ్లాప్‌లు రావడంతో ఆమెకు ఆఫర్లు తగ్గాయి. ప్రస్తుతం టాలీవుడ్‌లో మృణాల్ చేతిలో ఒక్క కొత్త ప్రాజెక్ట్ కూడా లేదని తెలుస్తోంది.