AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇది కదా తెలంగాణ సూపర్ పోలీస్ అంటే.. 30 నిమిషాల్లో సీన్ రివర్స్ చేశారుగా

పెద్దలు మాటల్లో మునిగిపోగా, ఆడుకుంటూ ఉన్న ఆద్యా కళ్లెదుట అదృశ్యమయ్యింది. కొద్దిసేపటి తర్వాత ఆద్యా కోసం వెతికిన తల్లిదండ్రులకు పాప ఎక్కడికెళ్ళిందో అర్థం కాకపోవడంతో చుట్టుపక్కల మొత్తం వెతికారు. ఇక చివరికి ఉత్తమ వల్ల కాదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు..

Telangana: ఇది కదా తెలంగాణ సూపర్ పోలీస్ అంటే.. 30 నిమిషాల్లో సీన్ రివర్స్ చేశారుగా
Police
Sravan Kumar B
| Edited By: |

Updated on: Feb 27, 2026 | 8:23 PM

Share

పోలీసుల సమర్థతతో 30 నిమిషాల్లోనే మిస్సయిన ఏడేళ్ల చిన్నారి ఆచూకీ కనుక్కొని శభాష్ అనిపించారు. నిజామాబాద్ చిరుకొండ మండలం రావుట్లా గ్రామానికి చెందిన ఆద్యా(7) ఇబ్రహీంపట్నంలో తప్పిపోయిన ఘటనలో SI సుమలత, ASI సతీష్ కుమార్ టెక్నాలజీ, సోషల్ మీడియా ద్వారా వేగంగా కనుగొని తల్లిదండ్రులకు అప్పగించారు. నిజామాబాద్ జిల్లా చిరుకొండ మండలం రావుట్లా గ్రామానికి చెందిన అంజలి-రాజు దంపతులు తమ 7 ఏళ్ల కుమార్తె ఆద్యాతో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్లారు.

పెద్దలు మాటల్లో మునిగిపోగా, ఆడుకుంటూ ఉన్న ఆద్యా కళ్లెదుట అదృశ్యమయ్యింది. కొద్దిసేపటి తర్వాత ఆద్యా కోసం వెతికిన తల్లిదండ్రులకు పాప ఎక్కడికెళ్ళిందో అర్థం కాకపోవడంతో చుట్టుపక్కల మొత్తం వెతికారు. ఇక చివరికి ఉత్తమ వల్ల కాదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు SI సుమలత, ASI సతీష్ కుమార్ తక్షణమే చిన్నారి ఫోటో, వివరాలు వాట్సాప్ గ్రూపులు, పోలీస్ నెట్‌వర్క్‌లో షేర్ చేశారు. రద్దీ ప్రాంతాలైన బస్టాండ్లు షాపింగ్ కాంప్లెక్స్‌లు, ఇతర ప్రాంతాల్లో పాప కోసం వెతికారు.

స్థానికుల సహకారంతో ఇబ్రహీంపట్నం మార్కెట్ ప్రాంతంలో ఆద్యాను గుర్తించి, అరగంటలోనే సురక్షితంగా తల్లిదండ్రుల చేత అప్పగించారు. వేగంగా స్పందించడంపై స్థానికులు, తల్లిదండ్రులు పోలీసులను అభినందించారు. రద్దీ ప్రదేశాల్లో చిన్నారుల జేబులో తల్లిదండ్రుల ఫోన్ నంబర్ ఉన్న కాగితం ఉంచమని సూచించారు. ఇలాంటి సంఘటనల్లో టెక్నాలజీ, సరైన సమయంలో కమ్యూనికేషన్ సహకారం కీలకమని పోలీసులు తెలిపారు. తప్పులు చేసే పోలీసులు చూశారు.. కరెప్షన్ చేసిన పోలీసులను చూశారు.. లంచం తీసుకుంటూ ఏసీపీకు పట్టు పడ్డ పోలీసుల్ని చూశారు.. కానీ కంప్లైంట్ వచ్చిన వెంటనే అరగంటలో చిన్న పాప ఆచూకీ కనుక్కొని వీళ్ళు మాత్రం సూపర్ పోలీసులమని నిరూపించారు.

Follow Us