AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ ఫ్యాక్టరీలో జోరుగా గంజాయి అమ్మకాలు.. కూలీలు, ఉద్యోగులే టార్గెట్‌..! కట్‌ చేస్తే..

తెలంగాణ వికారాబాద్‌లోని పరిగి సుగుణ స్టీల్ ఫ్యాక్టరీ వద్ద ఎక్సైజ్ పోలీసులు 1 కేజీ 50 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బీహార్, ఒడిస్సా నుంచి వచ్చిన నితీష్ రఝాక్, సూరజ్ కుమార్‌లను అరెస్టు చేశారు. తోటి లేబర్లకు గంజాయి విక్రయిస్తుండగా పక్కా సమాచారంతో దాడి చేశారు. వీరిపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. తెలంగాణలో గంజాయి అక్రమ రవాణా పెరుగుతుందని ఎక్సైజ్ హెచ్చరించింది.

ఆ ఫ్యాక్టరీలో జోరుగా గంజాయి అమ్మకాలు.. కూలీలు, ఉద్యోగులే టార్గెట్‌..! కట్‌ చేస్తే..
Ganja Bust
Sravan Kumar B
| Edited By: |

Updated on: Feb 25, 2026 | 8:36 PM

Share

వికారాబాద్‌ జిల్లా పరిగి మండలంలో పెద్ద మొత్తంలో గంజాయిని పట్టుబడింది. మండలంలోని సుగుణ స్టీల్ ఫ్యాక్టరీ సమీపంలో ఎక్సైజ్ పోలీసులు 1 కేజీ 50 గ్రాముల గంజాయి సీజ్ చేశారు. బీహార్, ఒడిస్సా నుంచి వచ్చిన నితీష్ రఝాక్, సూరజ్ కుమార్‌లను అరెస్టు చేశారు. పరిగి మండలం సుగుణ స్టీల్ ఫ్యాక్టరీలో పనిచేసే లేబర్లకు గంజాయి విక్రయిస్తున్నారనే పక్కా సమాచారంతో ఎక్సైజ్ సీఐ నీరజాదేవి బృందం దాడి చేసింది. బీహార్ నుంచి గంజాయి తీసుకువచ్చిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు ఒడిస్సా ప్రాంతం నుంచి తీసుకువచ్చి తోటి లేబర్లకు అమ్ముతున్నట్లు ఒప్పుకున్నారు.

ఈ మేరకు ఇద్దరిపై NDPS చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ నీరజాదేవి తెలిపారు. ఫ్యాక్టరీలో పనిచేసే లేబర్ల మధ్య గంజాయి వ్యాపారం విస్తరిస్తోందని వివరించారు. ఇలాంటి అక్రమాలను అరికట్టేందుకు తనిఖీలు పెంచామని చెప్పారు. 6 నెలల్లో తెలంగాణ వ్యాప్తంగా ఎక్సైజ్ శాఖ భారీగా గంజాయి సీజ్ చేసింది. ఖమ్మం, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో 100 కేజీలకు పైగా గంజాయి, హాషీష్ ఆయిల్ పట్టుకున్నారు. 2024లో ఎక్సైజ్ నేరాలు పెరిగి, గంజాయి విక్రయాలు జోరుగా సాగాయి. తెలంగాణకు ఎక్కువగా గంజాయి ఒడిస్సా, ఆంధ్ర ఉత్తరాంధ్ర అటవీ ప్రాంతాల నుంచి వస్తోంది. ఒడిస్సా సరిహద్దు గ్రామాల్లో పండించిన గంజాయిని బీహార్, ఇతర రాష్ట్రాల ద్వారా తెలంగాణలోకి తీసుకువస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
శాంసన్‌పై వేటు తప్పదా.. రెండో టీ20కి భారత్ తుది జట్టు ఇదే..?
శాంసన్‌పై వేటు తప్పదా.. రెండో టీ20కి భారత్ తుది జట్టు ఇదే..?
మగవారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి అసలు కారణాలు ఏంటో తెలుసా..?
మగవారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి అసలు కారణాలు ఏంటో తెలుసా..?
ఫిఫా వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా పై ఈజిప్ట్ చారిత్రాత్మక విజయం
ఫిఫా వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా పై ఈజిప్ట్ చారిత్రాత్మక విజయం
మీ సిబిల్ రిపోర్టులో ఈ పదం ఉందా..? జాగ్రత్త పడకపోతే..
మీ సిబిల్ రిపోర్టులో ఈ పదం ఉందా..? జాగ్రత్త పడకపోతే..
బ్లాక్ బస్టర్‌ తరువాత లాంగ్ గ్యాప్‌... ఏం ప్లాన్ చేస్తున్నారు?
బ్లాక్ బస్టర్‌ తరువాత లాంగ్ గ్యాప్‌... ఏం ప్లాన్ చేస్తున్నారు?
స్టార్ హీరో ఇంట్లో దొంగతనం..డ్రైవర్ అరెస్ట్..
స్టార్ హీరో ఇంట్లో దొంగతనం..డ్రైవర్ అరెస్ట్..
రోహిత్ శర్మ రికార్డును అందుకోవడం ఎవరికైనా సాధ్యమేనా?
రోహిత్ శర్మ రికార్డును అందుకోవడం ఎవరికైనా సాధ్యమేనా?
శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులే టార్గెట్.. నలుగురు అరెస్ట్‌
శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులే టార్గెట్.. నలుగురు అరెస్ట్‌
భారత బ్యాటర్లను భయపెట్టేందుకు ఇంగ్లాండ్ అస్త్రాలు సిద్ధం
భారత బ్యాటర్లను భయపెట్టేందుకు ఇంగ్లాండ్ అస్త్రాలు సిద్ధం
ఒక్కో సినిమాతో పాన్ ఇండియాను షేక్ చేస్తున్న బస్ డ్రైవర్ కొడుకు..
ఒక్కో సినిమాతో పాన్ ఇండియాను షేక్ చేస్తున్న బస్ డ్రైవర్ కొడుకు..