AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రెండ్ మారింది గురూ..! బస్టాండ్‌లో అందరిచూపు ఆ బోర్డుపైనే..

సూర్యాపేట కొత్త ఆర్టీసీ బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన ఓ బోర్డు ఇప్పుడు ప్రయాణికుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇన్నాళ్లూ మహిళలు, వృద్ధులు, దివ్యాంగులను గౌరవించాలనే సందేశాలు కనిపించగా.. తాజాగా **“పురుషులను గౌరవించండి”** అంటూ కనిపించిన బోర్డు ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే దీని ఉద్దేశం పురుషులకు మాత్రమే ప్రత్యేక గౌరవం ఇవ్వడం కాదని అధికారులు చెబుతున్నారు.

ట్రెండ్ మారింది గురూ..! బస్టాండ్‌లో అందరిచూపు ఆ బోర్డుపైనే..
Suryapet Rtc Bus Stand
M Revan Reddy
| Edited By: |

Updated on: Aug 13, 2026 | 4:27 PM

Share

స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం.. వారికి కేటాయించిన సీట్లల్లో వారినే కూర్చోనిద్దాం.. ఇలా మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక సీట్లు కేటాయించడం మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. ముఖ్యంగా ఆర్టిసి బస్సుల్లో ఈ సూచనలు కనిపిస్తుంటాయి. గతంలో మహిళల కోసం కనిపించే సూచనలకు భిన్నంగా.. ఇప్పుడు ఇతరుల గౌరవం గురించి చెబుతున్న ఓ బోర్డు అందరినీ ఒక్కసారిగా ఆలోచింపజేస్తోంది. అందర్నీ ఆకట్టుకుంటున్న ఆ బోర్డులో ఏముందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.. సాధారణంగా చాలామంది ప్రజా రవాణా వ్యవస్థ ఆర్టిసి బస్సుల్లోనే ప్రయాణిస్తుంటారు. బస్సుల్లో సీట్ల కోసం నిత్యం గొడవలు, తగాదాలు జరుగుతుంటాయి. వీటతిని గత కొంతకాలం నుంచి చూస్తూనే ఉన్నాం.. ‘‘ఆర్టీసీ బస్సులు, బస్టాండ్లలో మహిళలకు కేటాయించిన సీట్లలో ఇతరులు కూర్చోవద్దు.. వృద్ధులు, దివ్యాంగులకు సీట్లు ఇవ్వాలి’’.. అనే సూచనలు ఎక్కువగా కనిపించేవి. ప్రత్యేకంగా మహిళలకు గౌరవం ఇవ్వాలని.. వారికి కేటాయించిన సీట్లను ఇతరులు ఆక్రమించకుండా చూడాలని ఆర్టీసీ సూచించేది. అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణాన్ని అమలు చేస్తోంది. దీంతో పురుషులతో పాటు మహిళలు కూడా ఆర్టీసీ బస్సుల్లో ఎక్కువగా ప్రయాణాలు చేస్తున్నారు. కొన్నిసార్లు ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం గొడవలు, తగాదాలు జరగడంతోపాటు.. కొట్టుకునే స్థాయి వరకు వెళ్తున్నాయి.

కానీ.. ఇప్పుడు సీన్ కాస్త మారింది..

తెలుగు రాష్ట్రాల మధ్య వారధిగా ఉన్న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కొత్త బస్టాండ్ నిత్యం ప్రయాణికులతో కిటకిట లాడుతూ ఉంటుంది. అయితే సూర్యాపేట కొత్త బస్టాండ్‌లో ప్రత్యక్షమైన ఓ బోర్డు అందరినీ ఆకర్షిస్తోంది. సూర్యాపేట కొత్త బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన బోర్డులో పురుషులను గౌరవించాలనే సందేశం కనిపిస్తోంది. దీంతో ప్రయాణికులు ఆసక్తిగా ఆ బోర్డును చూస్తున్నారు. గతంలో మహిళల కోసం కనిపించే సూచనలకు భిన్నంగా.. ఇప్పుడు పురుషుల గౌరవం గురించి చెబుతున్న ఆ బోర్డు అందరినీ ఒక్కసారిగా ఆలోచింపజేస్తోంది. “ట్రెండ్ మారింది గురూ..” అంటూ ప్రయాణికులు సరదాగా చెప్పుకుంటున్నారు.

ఇన్నాళ్లూ “మహిళలను గౌరవించండి” అనే సందేశాలు స్థానంలో ఇప్పుడు మాత్రం. “పురుషులను గౌరవించండి” అనే సందేశం బోర్డుపై కనిపించడంతో ప్రయాణికుల్లో ఆసక్తి పెరిగింది. సీటు ఎవరి కోసం కేటాయించారో.. ఆ సీటును వారికే వదిలేయాలి. మహిళలైనా.. పురుషులైనా.. వృద్ధులైనా.. దివ్యాంగులైనా.. ప్రయాణికుల సౌకర్యం కోసం కేటాయించిన సీట్లను ఇతరులు ఆక్రమించకూడదన్నదే ప్రధాన ఉద్దేశం. అయితే ఇది కేవలం పురుషుల కోసం మాత్రమే అనే అర్థం కాదని.. సీటు కోసం గొడవ కాదు..సీటు విషయంలో గౌరవం ఉండాలి. ప్రయాణికుల మధ్య పరస్పర గౌరవం ఉండాలన్న సందేశమేనని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

గౌరవం అనేది ఒక్క వర్గానికే పరిమితం కాదు.. ప్రయాణంలో ఒకరి హక్కులను మరొకరు గౌరవిస్తే.. బస్సు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుందని అధికారులు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
నెగెటివ్‌ థాట్స్ ఎలా ఆపాలి? ఈ కథ మీ సందేహాలకు సమాధానం చెబుతుంది!
నెగెటివ్‌ థాట్స్ ఎలా ఆపాలి? ఈ కథ మీ సందేహాలకు సమాధానం చెబుతుంది!
డబ్బు నిలవడం లేదా..? ఆర్థిక ఇబ్బందులకు కేమద్రుమ యోగమే కారణమా?
డబ్బు నిలవడం లేదా..? ఆర్థిక ఇబ్బందులకు కేమద్రుమ యోగమే కారణమా?
పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవాలా..? రూల్స్‌లో పెద్ద మార్పులు..
పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవాలా..? రూల్స్‌లో పెద్ద మార్పులు..
35 ఏళ్లకే కన్నుమూసిన నవ్వుల నవాబు..
35 ఏళ్లకే కన్నుమూసిన నవ్వుల నవాబు..
జాతీయ పక్షి నెమలి ఎన్ని సంవత్సరాలు జీవిస్తుందో తెలుసా?
జాతీయ పక్షి నెమలి ఎన్ని సంవత్సరాలు జీవిస్తుందో తెలుసా?
కాఫీ ఎక్కువగా తాగే దేశమేది? యాపిల్, నిమ్మ ఎందుకు నీళ్లలో తేలుతాయి
కాఫీ ఎక్కువగా తాగే దేశమేది? యాపిల్, నిమ్మ ఎందుకు నీళ్లలో తేలుతాయి
తొందరగా బరువు పెరిగే నెల్లూరు గొర్రెలు: లాభదాయక పెంపకం
తొందరగా బరువు పెరిగే నెల్లూరు గొర్రెలు: లాభదాయక పెంపకం
నవరాత్రుల్లో ఈ రాశులకు రాజయోగం.. సంపద, ఉద్యోగం, వ్యాపారంలో..
నవరాత్రుల్లో ఈ రాశులకు రాజయోగం.. సంపద, ఉద్యోగం, వ్యాపారంలో..
ఏ పండులో అన్ని విటమిన్లు ఉంటాయి? ఇలాంటి పండు భూమిపై నిజంగా ఉందా..
ఏ పండులో అన్ని విటమిన్లు ఉంటాయి? ఇలాంటి పండు భూమిపై నిజంగా ఉందా..
200 ప్లస్ టార్గెట్ వస్తే అభిషేక్ శర్మకు ఏమవుతుంది?
200 ప్లస్ టార్గెట్ వస్తే అభిషేక్ శర్మకు ఏమవుతుంది?