AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తప్పిపోయిన షిరో.. ఎట్టకేలకు 20 కి.మీ. దూరంలో ఆచూకీ లభ్యం..! ఎలా దొరికిందో తెలుసా..?

పెంపుడు జంతువులు ఇంట్లోని ఒక సభ్యుడితో సమానం. అవి కొద్దిసేపు కనిపించకపోయినా ఆ కుటుంబం పడే వేదన వర్ణనాతీతం. సరిగ్గా అలాంటి సంఘటనే హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. అయితే ఒక మహిళా పోలీసు కానిస్టేబుల్ చూపిన చొరవ, సాంకేతికత సరైన వినియోగం వల్ల తప్పిపోయిన ఒక పెంపుడు కుక్క క్షేమంగా తన యజమాని ఒడికి చేరింది.

తప్పిపోయిన షిరో.. ఎట్టకేలకు 20 కి.మీ. దూరంలో ఆచూకీ లభ్యం..! ఎలా దొరికిందో తెలుసా..?
Hyderabad Missing Pet Dog
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Sep 24, 2026 | 9:36 AM

Share

హైదరాబాద్‌లో ఓ పెంపుడు కుక్క అదృశ్యమవడంతో ఆ కుటుంబంలో ఆందోళన నెలకొంది. మధురానగర్‌ ప్రాంతానికి చెందిన షిరో అనే పెంపుడు కుక్క కనిపించకుండా పోవడంతో దాని యజమాని నగరంలోని పలు ప్రాంతాల్లో వెతికారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో మరింత ఆందోళన చెందారు. ఈ విషయం పోలీసు కానిస్టేబుల్‌ దీప్తి దృష్టికి వెళ్లడంతో ఆమె ప్రత్యేక చొరవ తీసుకున్నారు.

షిరో ఫొటోతో పాటు దాని వివరాలను పలు వాట్సాప్‌ గ్రూపుల్లో షేర్‌ చేశారు. స్థానిక ప్రాంతానికే పరిమితం కాకుండా నగరంలోని వివిధ ప్రాంతాలకు సమాచారం చేరేలా విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో షిరోను గుర్తించేందుకు మరింత మందికి అవకాశం లభించింది. ఈ ప్రయత్నం చివరకు ఫలించింది. మధురానగర్‌ నుంచి తప్పిపోయిన షిరో దాదాపు 20 కిలోమీటర్ల దూరంలోని మౌలాలిలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడ కుక్క ఆచూకీని నిర్ధారించుకున్న అనంతరం ఈ విషయాన్ని యజమానికి సమాచారం అందించారు. దీంతో షిరోను సురక్షితంగా యజమాని వద్దకు చేర్చారు.

చాలాకాలం తర్వాత తమ పెంపుడు కుక్కను తిరిగి చూసుకోవడంతో యజమాని ఆనందం వ్యక్తం చేశారు. షిరోను గుర్తించడంలో, తిరిగి తన వద్దకు చేర్చడంలో కీలకంగా వ్యవహరించిన కానిస్టేబుల్‌ దీప్తికి కృతజ్ఞతలు తెలిపారు. ఓ పెంపుడు జంతువు తప్పిపోయినప్పుడు దాని యజమాని పడే ఆవేదనను అర్థం చేసుకుని.. తన వంతు ప్రయత్నంగా వాట్సాప్‌ గ్రూపుల ద్వారా సమాచారాన్ని విస్తృతంగా చేరవేసిన కానిస్టేబుల్‌ దీప్తి చొరవ ఇప్పుడు ప్రశంసలు అందుకుంటోంది. ఈ ప్రయత్నం ద్వారా షిరో సురక్షితంగా తన కుటుంబాన్ని చేరుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us