AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జుట్టు విపరీతంగా రాలుతోందా? హెయిర్ ఎక్స్‌పర్ట్ జావేద్ హబీబ్ చెప్పిన ఈ సింపుల్ చిట్కాలు పాటించండి!

ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య జుట్టు రాలడం. ప్రతిరోజూ దువ్వెనలో చిక్కులు పడి జుట్టు ఊడిపోతుంటే తీవ్ర ఆందోళన చెందుతుంటారు. ఈ సమస్య నివారణకు ఖరీదైన హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ వాడేకంటే, క్రమశిక్షణతో కూడిన సరైన సంరక్షణ పద్ధతులు పాటించడం ముఖ్యాతి ముఖ్యమని ప్రముఖ హెయిర్ ఎక్స్‌పర్ట్ జావేద్ హబీబ్ చెబుతున్నారు. ఆయన సూచించిన ప్రధానమైన హెయిర్ కేర్ చిట్కాలు ఇవే:

జుట్టు విపరీతంగా రాలుతోందా? హెయిర్ ఎక్స్‌పర్ట్ జావేద్ హబీబ్ చెప్పిన ఈ సింపుల్ చిట్కాలు పాటించండి!
Javed Habib Hair Care Tips
Jyothi Gadda
|

Updated on: Sep 24, 2026 | 7:37 AM

Share

ప్రస్తుత జీవనశైలి, కాలుష్యం కారణంగా జుట్టు రాలడం తీవ్రమైన సమస్యగా మారింది. ఈ సమస్యకు ప్రముఖ హెయిర్ ఎక్స్‌పర్ట్ జావేద్ హబీబ్ కొన్ని సులభమైన చిట్కాలను సూచించారు. జుట్టు ఆరోగ్యాన్ని కాపాడటానికి ప్రీ-కండిషనింగ్ పద్ధతి ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ఈ ప్రీ-కండిషనింగ్‌ పద్ధతి అంటే ఏంటి..? దీనిని ఎలా పాటించాలో వివరంగా తెలుసుకుందాం..

ప్రీ-కండిషనింగ్ పద్ధతి-

తలస్నానానికి ముందు ప్రీ-కండిషనింగ్ చేయడం జుట్టు రాలడాన్ని అరికట్టడంలో అద్భుతంగా పనిచేస్తుందని జావేద్ హబీబ్ తెలిపారు.

మొదట జుట్టును తేలికగా తడి చేయాలి. ఆ తర్వాత నూనెను జుట్టు పొడవునా రాయాలి. నూనె రాసేటప్పుడు స్కాల్ప్‌పై లేదా కుదుళ్ల వద్ద గట్టిగా మసాజ్ చేయకూడదు. జుట్టు పొడవుగా ఉంటే, నూనె రాసిన తర్వాత వెడల్పాటి పళ్ళున్న దువ్వెనతో తేలికగా దువ్వుకోవచ్చు. నూనె రాసిన 5 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి.

ఇవి కూడా చదవండి

సరైన పద్ధతిలో శుభ్రపరచడం-

స్కాల్ప్, జుట్టును ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. నూనె పెట్టిన 5 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూ లేదా సాంప్రదాయ పద్ధతి అయిన షికాకాయ్‌తో తలస్నానం చేయాలి. ఇది జుట్టులోని మురికిని, జిడ్డును తొలగించి కుదుళ్లను బలంగా ఉంచుతుంది.

క్రమశిక్షణతో కూడిన సంరక్షణ-

జుట్టు రాలడం, చిట్లడం, చుండ్రు తగ్గడానికి ఒకేసారి పెద్ద మార్పులు రావు. క్రమం తప్పకుండా సరైన పద్ధతిలో తలస్నానం చేయడం, కుదుళ్లను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా కేవలం కొన్ని రోజుల్లోనే మంచి మార్పును గమనించవచ్చు. అధిక రసాయనాలు ఉన్న ఖరీదైన ఉత్పత్తుల కంటే రోజువారీ సరైన సంరక్షణే జుట్టుకు మేలు చేస్తుంది. తలస్నానానికి ముందు ఈ ప్రీ-కండిషనింగ్ పద్ధతిని పాటిస్తే జుట్టు రాలడం తగ్గి, జుట్టు దృఢంగా మరియు ఒత్తుగా మారుతుంది. అయితే, సమస్య మరీ తీవ్రంగా ఉంటే నిపుణులైన వైద్యులను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
అక్షరం ముక్క రాకపోయినా.. సోలార్ ఇంజినీర్లుగా ఇళ్లకు వెలుగులు
అక్షరం ముక్క రాకపోయినా.. సోలార్ ఇంజినీర్లుగా ఇళ్లకు వెలుగులు
41 వేల అడుగుల ఎత్తులో ఇంధనం ఖాళీ.. చివరికి.. !
41 వేల అడుగుల ఎత్తులో ఇంధనం ఖాళీ.. చివరికి.. !
బషీర్ బలూచ్‌ పై విష ప్రయోగం? మిస్టరీగా BLA చీఫ్ ఆచూకీ
బషీర్ బలూచ్‌ పై విష ప్రయోగం? మిస్టరీగా BLA చీఫ్ ఆచూకీ
పిజ్జాపై పైనాపిల్ టాపింగ్ వివాదం.. చెఫ్‌కు షాకిచ్చిన యాజమాన్యం!
పిజ్జాపై పైనాపిల్ టాపింగ్ వివాదం.. చెఫ్‌కు షాకిచ్చిన యాజమాన్యం!
గమ్యానికి చేరువలో ఆగిన గుండె.. మారథాన్‌లో కుప్పకూలిన యువతి!
గమ్యానికి చేరువలో ఆగిన గుండె.. మారథాన్‌లో కుప్పకూలిన యువతి!
రెమ్యునరేషన్ తక్కువైందని సీత పాత్ర రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్
రెమ్యునరేషన్ తక్కువైందని సీత పాత్ర రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్
ఒక ఫోన్ నుండి మరొక ఫోన్‌కు ఛార్జింగ్‌ను ఎలా బదిలీ చేయాలో తెలుసా?
ఒక ఫోన్ నుండి మరొక ఫోన్‌కు ఛార్జింగ్‌ను ఎలా బదిలీ చేయాలో తెలుసా?
ఎముకల పుష్టికి హెల్దీ రాగి బర్ఫీ.. 
ఎముకల పుష్టికి హెల్దీ రాగి బర్ఫీ.. 
బంగాళాదుంపలను ఎక్కువ కాలం తాజాగా ఎలా ఉంచాలి? బెస్ట్‌ ట్రిక్స్‌..!
బంగాళాదుంపలను ఎక్కువ కాలం తాజాగా ఎలా ఉంచాలి? బెస్ట్‌ ట్రిక్స్‌..!
హీరోగా కమెడియన్.. స్పెషల్ సాంగ్ చేసిన కృష్ణ.. 32 ఏళ్లైనా..
హీరోగా కమెడియన్.. స్పెషల్ సాంగ్ చేసిన కృష్ణ.. 32 ఏళ్లైనా..