AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న బస్సును ఢీకొన్న కంటైనర్.. ముగ్గురు మృతి!

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం గోవింద్‌పేట్ వద్ద NH44పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పంచరైన ప్రైవేట్ బస్సును వెనుక నుంచి వచ్చిన కంటైనర్ ఢీకొనడంతో ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దుర్ఘటనలో మృతిచెందినవారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు, కంటైనర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.

Telangana: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న బస్సును ఢీకొన్న కంటైనర్.. ముగ్గురు మృతి!
Nizamabad Accident
Balaraju Goud
|

Updated on: Aug 13, 2026 | 3:39 PM

Share

నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మండలం గోవింద్‌పేట్ సమీపంలోని జాతీయ రహదారి 44పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కిన్వాట్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ బస్సును వెనుక నుంచి కంటైనర్ ఢీకొట్టడంతో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం.

ప్రాథమిక వివరాల ప్రకారం.. ప్రయాణిస్తున్న ప్రైవేట్ బస్సు టైరు పంచర్ కావడంతో గోవింద్‌పేట్ సమీపంలో రహదారిపై నిలిపారు. బస్సులోని కొంతమంది ప్రయాణికులు కిందకు దిగి రహదారి పక్కన ఉన్న డివైడర్‌పై కూర్చున్నారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్ ఆగి ఉన్న బస్సును ఢీకొట్టింది. కంటైనర్ లారీ ఢీకొట్టడంతో బస్సు ముందుకు దూసుకెళ్లి డివైడర్‌పై కూర్చున్న ప్రయాణికులపైకి వెళ్లింది. ఈ ఘటనలో సుజాత, మాధవి అనే ఇద్దరు మహిళలు బస్సు చక్రాల కింద చిక్కుకుని మృతి చెందారు. మృతులు మహారాష్ట్రలోని కిన్వాట్ ప్రాంతానికి చెందినవారిగా గుర్తించినట్లు సమాచారం.

ప్రమాదంలో మరో వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా, 108 సిబ్బంది వారిని వెంటనే ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న ఆర్మూర్, జక్రాన్‌పల్లి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం అనంతరం కంటైనర్ డ్రైవర్ అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మామూలు క్రేజ్ కాదు భయ్యా.. 12 రోజుల్లో 1.5 కోట్ల అప్లికేషన్లు..
మామూలు క్రేజ్ కాదు భయ్యా.. 12 రోజుల్లో 1.5 కోట్ల అప్లికేషన్లు..
లెమన్ టీ ఆరోగ్యానికి మంచిదేనా? ఈ సమస్యలు ఉన్నవారు దూరంగా ఉండాలి!
లెమన్ టీ ఆరోగ్యానికి మంచిదేనా? ఈ సమస్యలు ఉన్నవారు దూరంగా ఉండాలి!
ఎలుగుబంటి దాడి.. మృత్యువు అంచున బాలుడు.. అంతలో..
ఎలుగుబంటి దాడి.. మృత్యువు అంచున బాలుడు.. అంతలో..
తెలంగాణలో మీ సేవ సర్టిఫికెట్లకు కొత్త సెక్యూరిటీ పేపర్..
తెలంగాణలో మీ సేవ సర్టిఫికెట్లకు కొత్త సెక్యూరిటీ పేపర్..
సీజేఐ ఒక్క కామెంట్‌తో పుట్టుకొచ్చిన మక్కీ జనతా పార్టీ..
సీజేఐ ఒక్క కామెంట్‌తో పుట్టుకొచ్చిన మక్కీ జనతా పార్టీ..
ఈజీగా బరువు తగ్గేందుకు జపనీస్‌ 3-3-3 వాకింగ్ ఫార్ములా..ఇది నిజంగా
ఈజీగా బరువు తగ్గేందుకు జపనీస్‌ 3-3-3 వాకింగ్ ఫార్ములా..ఇది నిజంగా
దుబాయ్‌లో పంజాబీ ట్రక్ డ్రైవర్‌కు రూ.1.3 కోట్ల లాటరీ..!
దుబాయ్‌లో పంజాబీ ట్రక్ డ్రైవర్‌కు రూ.1.3 కోట్ల లాటరీ..!
అందమైన జా లైన్ కోసం సులువైన చిట్కాలు.. ముఖంపై కొవ్వుకు చెక్!
అందమైన జా లైన్ కోసం సులువైన చిట్కాలు.. ముఖంపై కొవ్వుకు చెక్!
విజయవాడ ఉత్సవ్‌లో చంద్రబాబు, తమిళనాడు సీఎం విజయ్‌..
విజయవాడ ఉత్సవ్‌లో చంద్రబాబు, తమిళనాడు సీఎం విజయ్‌..
ఒక్క విన్నపంతో కదిలిన దేశం.. అనాథ అమ్మాయికి అద్భుత కళ్యాణం!
ఒక్క విన్నపంతో కదిలిన దేశం.. అనాథ అమ్మాయికి అద్భుత కళ్యాణం!