ఖాళీ కడుపుతో ఈ టీ తీసుకోండి చాలు.. ఇప్పుడిదే ట్రెండింగ్ తెలుసా?

August 13

Jyothi Gadda

రోగనిరోధక శక్తి పెంపు: బ్రాహ్మి ఆకుల్లో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు శరీర రక్షణ వ్యవస్థను పటిష్టం చేస్తాయి. శరీరంలో హానికర ఫ్రీ రాడికల్స్ బారి నుండి మెదడు కణాలను సురక్షితం కాపాడాతాయి.

మెదడు చురుకుదనం: ఈ టీని రోజూ క్రమం తప్పకుండా తాగడం వల్ల జ్ఞాపకశక్తికి పెరుగుతుంది. ఆలోచనా శక్తిని, ఏకాగ్రతను రెట్టింపు చేసి మానసిక చురుకుదనాన్ని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

ఒత్తిడి, ఆందోళన నివారణ: శరీరంలో మానసిక ఆందోళనలను దూరం చేసే గుణాలు ఉన్నాయి.. దీనివల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడి, శారీరక అలసటలు తగ్గి, మనస్సుకు తక్షణ ఉపశమనం, ప్రశాంతత లభిస్తాయి.

జీర్ణ వ్యవస్థకు మేలు: మానసిక ఆరోగ్యంతో పాటు, జీర్ణ సంబంధిత సమస్యలకు చక్కని పరిష్కారం. రోజూ పరగడుపున ఈ టీని తీసుకోవడంతో గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం తగ్గి జీర్ణనాళం ప్రశాంతంగా మారుతుంది.

చర్మం, జుట్టు ఆరోగ్యం: బ్రాహ్మిలోని అద్భుతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మ కణాలను సంరక్షిస్తాయి. ఇవి వృద్ధాప్యాన్ని దూరం చేస్తాయి. జుట్టు కుదుళ్లను దృఢంగా మార్చి, జుట్టు ఒత్తుగా, బలంగా పెరిగేలా చేస్తుంది. 

శ్వాసకోశ సమస్యల నివారణ: ఇది ఊపిరితిత్తులలో పేరుకుపోయిన శ్లేష్మాన్ని సులభంగా తొలగించి, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.

గుండె ఆరోగ్య పరిరక్షణ: గుండె పనితీరును మెరుగుపరిచి, శరీరంలో రక్తప్రసరణను సరళతరం చేస్తాయి. ధమనుల్లో అనవసర కొవ్వు పేరుకుపోకుండా నిరోధించి, గుండె జబ్బుల ప్రమాదం రాకుండా రక్షిస్తుంది.

ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం: అధిక కేఫీన్, కృత్రిమ రసాయనాలు ఉండే సాధారణ కాఫీ, టీలకు ఇది అద్భుతమైన ప్రత్యామ్నాయం. శరీరానికి చలవను అందించి రోజంతా ఆహ్లాదకరమైన అనుభూతిని ఇస్తుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఈ టీని పరిమితికి మించి తీసుకుంటే వికారం, తలనొప్పి వచ్చే అవకాశముంది. లో-బీపీ ఉన్నవారు, గర్భిణులు, బాలింతలు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకున్నాకే వాడటం మంచిది.