ఇంటి ఆవరణలో జిల్లేడు మొక్క ఉంటే ఏమౌతుంది?

06 July  2026

Jyothi Gadda

ఈశ్వరుడికి, వినాయకుడికి ఎంతో ప్రీతిపాత్రమైన జిల్లేడు చెట్టును ఇంటి ప్రాంగణంలో పెంచవచ్చా లేదా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. దీనిపై వాస్తు నిపుణులు చెబుతున్న ఆసక్తికరమైన విషయాలు ఇవే!

సాధారణ వాస్తు సూత్రాల ప్రకారం, ఏ మొక్కను తుంచినా లేదా ఆకు కోసినా తెల్లటి పాలు కారుతాయో, అటువంటి మొక్కలను ఇంటి లోపల లేదా సింహద్వారానికి ఎదురుగా పెంచకూడదు. 

జిల్లేడు కూడా ఈ కోవకు చెందినదే. వీటి వల్ల ఇంట్లోని సభ్యులపై ప్రతికూల ప్రభావం పడుతుందని, మానసిక ప్రశాంతత తగ్గుతుందని వాస్తు చెబుతుంది. కాబట్టి,

సాధారణ నీలం లేదా ఊదా రంగు పూలు పూసే జిల్లేడును ఇంటి సరిహద్దుల లోపల కాకుండా, ఇంటికి కాస్త దూరంగా బయటి వైపు పెంచడం ఉత్తమం.

అయితే, తెల్ల జిల్లేడును సాక్షాత్తు వినాయకుడి స్వరూపంగా భావిస్తారు. కనీసం 12 ఏళ్లు దాటిన తెల్ల జిల్లేడు చెట్టు వేరును తవ్వి తీస్తే, అది సహజంగానే వినాయకుడి ఆకారాన్ని పోలి ఉంటుంది.

దీనిని శ్వేతార్క గణపతి అంటారు. ఈ తెల్ల జిల్లేడు మొక్కను ఇంటి ముఖద్వారం వద్ద లేదా ఈశాన్య మూలలో తగిన జాగ్రత్తలతో పెంచడం వల్ల ఇంటికి ఒక రక్షణ కవచం ఏర్పడుతుందని నమ్ముతారు.

తెల్ల జిల్లేడు వేరు లేదా మొక్క ఇంటి ముందు ఉండటం వల్ల ఎంతటి ఘోరమైన నరదృష్టి, నరగోష అయినా సరే పటాపంచలైపోతాయి. శ్వేతార్క గణపతిని జించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.

జిల్లేడు రవి గ్రహానికి ప్రతీక. దీనిని ఆరాధించడం వల్ల జాతకంలోని సూర్య దోషాలు తొలగిపోతాయి. జిల్లేడులో ఎన్నో ఔషధ గుణాలు, ఆధ్యాత్మిక శక్తులు ఉన్నప్పటికీ, దాని నుండి వచ్చే పాలు కళ్లకు చాలా ప్రమాదకరం.