తస్సాదియ్యా..! ఇది కదా మేకోవర్ అంటే..!! అప్పుడు 108 కిలోలు.. ఇప్పుడు సన్నజాజి తీగ.. ఎవరో చెప్పుకోండి చూద్దాం.!
ఈ ఫోటోలో బొద్దుగా కనిపిస్తున్న అమ్మాయిని గుర్తుపట్టారా.. ? ఇప్పుడు బుల్లితెరపై టాప్ యాంకర్. అందంలో హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని ఈ ముద్దుగుమ్మ.. తన వాక్చాతుర్యం, కామెడీ పంచులతో పలు షోలలో అలరిస్తుంది. అలాగే సినిమాల్లోనూ నటించి మెప్పించింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

అమ్మబాబోయ్.. పై ఫొటోలో కనిపిస్తున్న నటి ఎవరో గుర్తుపట్టారా.? ఎవరో తెలిస్తే షాక్ అయ్యి షేక్ అయిపోతారు. ఆ ఫొటోలో కనిపిస్తున్న ఆమె ఇప్పుడు చాలా పాపులర్. ఆమె పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఆమె ఎవరో గుర్తుపట్టారా.? ఒకప్పుడు బొద్దుగా ఉన్న ముద్దుగుమ్మ ఇప్పుడు సన్నజాజి తీగలా మారిపోయి కవ్విస్తుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఆమె మరెవరో కాదు.. మనందరి ఫేవరెట్ యాంకరమ్మ. టీవీ షోలే కాదు. ఒకప్పుడు సినిమాల్లో కీలక పాత్రలు పోషించిన ఈ బ్యూటీ.. అటు సినిమాలు ఇటు టీవీ షోలు చేస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ? ఆమె మరెవరో కాదు.. బుల్లితెర రాములమ్మా శ్రీముఖి. కెరీర్ తొలినాళ్లల్లో ఈ ముద్దుగుమ్మ కాస్త బొద్దుగా ఉండేది. ఆ తర్వాత డైట్, వెయిట్ కంట్రోల్ అంటూ బాగా కష్టపడి ఇప్పుడు మరింత అందంగా మారిపోయింది.
ఇది కూడా చదవండి: అమ్మబాబోయ్..! మేడం ఇది మీరేనా..!! సింధుతులాని ఇప్పుడు ఎంత మారిపోయింది
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్న ఈ అమ్మడు పాతఫోటోస్ చూస్తే అస్సలు గుర్తుపట్టలేరు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గతంలో తన ఓల్డ్ లుక్ గురించి ఆమె ఆసక్తికర కామెంట్స్ కూడా చేసింది. ఓ టీవీ షోలో ఈ ఫోటోల గురించి మాట్లాడుతూ.. అందులో శ్రీముఖి ఎవరూ గుర్తుపట్టలేనంత బొద్దుగా ఉంది. ఇది నిజంగా శ్రీముఖి ఫోటోయేనా అంటూ అడగ్గా.. అసలు విషయం చెప్పేసింది శ్రీముఖి.
ఇది కూడా చదవండి :అయ్యో.. ఫోన్ ఎంతపని చేసింది..!! హాస్పటల్ పాలైన అందాల నటి.. కారణం తెలిస్తే షాక్ ఆడుతారు
అది తన 10వ తరగతి ఫోటో అని.. ఆ సమయంలో ఒక్కసారి కూర్చుంటే మినిమమ్ రెండు బిర్యానీ ప్యాకెట్స్ అయిపోవాలంటూ చెప్పుకొచ్చింది. తిని తిని ఏకంగా 108 కిలోలు పెరిగిపోయానని చెప్పుకొచ్చింది. దీంతో శ్రీముఖి ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. ఇక శ్రీముఖి ఇటీవలే మా ఇంటి బంగారం సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది.
ఇది కూడా చదవండి :జెన్ జీలకు తెగ నచ్చేసిన సినిమా ఇదే.. ఒక్కసారి చూస్తే మీరూ వదిలిపెట్టారు.!
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




