AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ స్టార్ కమెడియన్ గుర్తున్నాడా.? ఆయన కొడుకు ఇప్పుడు ప్రముఖ స్వామిజీ.. ఎవరో తెలిస్తే షాక్ అవుతారు.

ప్రముఖ హాస్యనటుడు ఓంకుచి నరసింహన్ జీవితం, సినీ ప్రస్థానం ఎంతో వైవిధ్యంగా ఆసక్తికరంగా ఉంటుంది. తన విలక్షణమైన రూపం, కీచు గొంతుతో ప్రేక్షకులను అలరించిన ఆయనకు "ఓంకుచి" అనే పేరు ఎలా వచ్చింది.? ఆయన కుటుంబ వివరాలు, సినిమాలతో పాటు, ఆయన కుమారుడు ఓంకారేశ్వర గురించి ఒక్కసారి చూద్దాం.!

ఈ స్టార్ కమెడియన్ గుర్తున్నాడా.? ఆయన కొడుకు ఇప్పుడు ప్రముఖ స్వామిజీ.. ఎవరో తెలిస్తే షాక్ అవుతారు.
Omkuchi Narasimhan
Rajeev Rayala
|

Updated on: Aug 13, 2026 | 8:43 PM

Share

ఈ కమెడియన్ గుర్తున్నాడా.? ఆయన ఓంకుచి నరసింహన్. ఆయన జీవితం, సినీ ప్రస్థానం చాలా విభిన్నంగా ఉంటుంది. బక్కపలచటి ఆకారం, కీచు గొంతుతో సుమారు 1500లకు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ఆయన అసలు పేరు నరసింహన్ కాగా, ఓంకుచి అనేది జనంలో పాపులర్ అయిన పేరు.ఓంకుచి నరసింహన్ 1936లో తమిళనాడులోని కుంభకోణం నగరంలో జన్మించారు. 13వ ఏట అబ్బయ్య అనే చారిత్రక చిత్రంలో బాలనటుడిగా నటించినా, ఆ తర్వాత చదువుపైనే పూర్తిగా దృష్టి సారించారు. డిగ్రీ పూర్తి చేసి ఎల్ఐసిలో ఉద్యోగం సంపాదించి కుటుంబానికి వెన్నుదన్నుగా నిలిచారు. సుదీర్ఘకాలం పాటు ఎల్ఐసిలో పనిచేసిన నరసింహన్, సరస్వతి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు పిల్లలు. వారిలో ముగ్గురు కుమార్తెలు విజయలక్ష్మి, నిర్మల, సంగీత కాగా, ఒక కుమారుడు ఓంకారేశ్వర ఉన్నారు.

ఇది కూడా చదవండి: అమ్మబాబోయ్..! మేడం ఇది మీరేనా..!! సింధుతులాని ఇప్పుడు ఎంత మారిపోయింది

బాలనటుడిగా ఒక సినిమా చేసిన తర్వాత, మళ్లీ వెండితెరపై కనిపించడానికి నరసింహన్‌కు 30 ఏళ్లు పట్టింది. తిరిగి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయనకు తమిళ లెజెండరీ నటుడు సురులి రాజన్, దర్శకుడు విసు వంటి వారి మద్దతు లభించింది. పలు సినిమాల్లో అవకాశాలు కల్పించడంతో, కమెడియన్‌గా అనతికాలంలోనే గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత దర్శకుడు శంకర్ వంటి వారి సినిమాల్లో నటించి ఎంతో మంచి పేరు సంపాదించారు. రజనీకాంత్, కమల్ హాసన్, విజయకాంత్ వంటి అగ్ర హీరోలందరితోనూ కలిసి నటించారు.

ఇది కూడా చదవండి :అయ్యో.. ఫోన్ ఎంతపని చేసింది..!! హాస్పటల్ పాలైన అందాల నటి.. కారణం తెలిస్తే షాక్ ఆడుతారు

తెలుగులోనూ ఓంకుచి నరసింహన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పవిత్రబంధం సినిమాలో ఆయన చేసిన కామెడీని ప్రేక్షకులు మర్చిపోలేరు. మా పల్లెలో గోపాలుడులో హఠాత్తుగా వెంట్రుకలు నిక్కపొడుచుకోవడం, భారతీయుడులో లారీ డ్రైవర్‌గా, ఒకే ఒక్కడులో వడివేలుకు మామగా, సంసారం చెదరంగంలో పెళ్ళీళ్ళ పేరయ్య క్యారెక్టర్‌లో ఇలా అనేక తెలుగు చిత్రాల్లో ప్రత్యేకమైన పాత్రలతో, చెప్పుకోదగ్గ కామెడీతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :జెన్ జీలకు తెగ నచ్చేసిన సినిమా ఇదే.. ఒక్కసారి చూస్తే మీరూ వదిలిపెట్టారు.!

ఒక స్టార్ కమెడియన్‌గా ఒక వెలుగు వెలిగిన ఓంకుచి నరసింహన్ గారి కుమారుడు ఓంకారేశ్వర ప్రస్తుతం ఎలా ఉన్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆయన వయస్సు 45 ఏళ్లకు పైమాటే. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని సినిమా రంగంలో నటుడిగా రాణిస్తాడని అనుకుంటే పొరపాటే. ఓంకారేశ్వర సన్యాసిగా మారి ఆధ్యాత్మిక మార్గంలో జీవిస్తున్నారు. తనకు దేవుళ్లు కనిపిస్తారని, సాయిబాబా, జీసస్ వంటి దేవుళ్లు తనతో మాట్లాడతారని, వారే తనను ప్రభావితం చేశారని ఆయన చెబుతారు. భక్తులకు దైవత్వం గురించి ప్రవచనాలు చెబుతూ, తాను ఎంచుకున్న జీవితానికి కారణం దేవుడు కనిపించడమేనని చెప్తుంటారు. తన కామెడీతో దాదాపు రెండు దశాబ్దాల పాటు ప్రేక్షకులను నవ్వించిన ఓంకుచి నరసింహన్, 2009 మార్చి 12న చెన్నైలో గొంతు క్యాన్సర్‌తో బాధపడుతూ మరణించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us