AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Renu Desai: వినాయకుడి విగ్రహం ముందు ఇలాంటి పనులా? రేణు దేశాయ్ తీవ్ర ఆగ్రహం.. వీడియో వైరల్

ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోన్న రేణూ దేశాయ్ సామాజిక అంశాలు, సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తున్నారు. అలా తాజాగా ఆమె వినాయక ఉత్సవాలు, నిమజ్ఞనాల నిర్వహణ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆమె షేర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Renu Desai: వినాయకుడి విగ్రహం ముందు ఇలాంటి పనులా? రేణు దేశాయ్ తీవ్ర ఆగ్రహం.. వీడియో వైరల్
Renu Desai
Basha Shek
|

Updated on: Sep 25, 2026 | 7:39 PM

Share

వినాయక నిమజ్ఞనాలపై ప్రముఖ నటి రేణూ దేశాయ్ ఆసక్తికర ప్రశ్నలు సంధించారు. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటోన్న ఆమె అర్థరాత్రి డీజేలతో హోరెత్తిస్తూ వినాయక నిమజ్జనాలు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు? అలాగే కొందరు మందు తాగి వినాయకుని విగ్రహం ముందు సినిమా పాటలకు డ్యాన్సులు చేయడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. పవిత్రమైన వినాయకుని పూజలు, నిమజ్ఞనాల ముసుగులో సాధారణ ప్రజలను ఇబ్బంది పెట్టొద్దంటూ ఆమె షేర్ చేసిన పోస్టులు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ వీడియోల్లో ఆమె మాట్లాడుతూ.. ‘నేను మాట్లాడేది నాకు ఇబ్బంది కలిగిందని కాదు. ఎందుకంటే నేను 18వ అంతస్తులో ఉంటున్నా. పైగా నాది సౌండ్ ప్రూఫ్ బెడ్ రూం. బయట ఎంత పెద్ద శబ్దం వచ్చినా నాకు ఎలాంటి సౌండ్ వినిపించదు. ప్రస్తుతం సిటీలో చాలామందికి వైరల్ జ్వరాలు వస్తున్నాయి. నా కూతురితో పాటు ఎంతోమంది ఇళ్లల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇలాంటి టైంలో రాత్రి 11-12 గంటల వరకు డీజేలు మోగిస్తే వృద్ధులు, పిల్లలు ఎంత ఇబ్బంది పడతారో మీకు తెలుసా? నగరంలో చాలా మంది ఉదయం ఉద్యోగాలకు వెళతారు. రాత్రి నిమజ్జనం చేసుకుంటామని అంటున్నారు. చేసుకున్నా సరే రాత్రి 6-7 గంటల్లోపు పూర్తి చేసుకోండి. రాత్రిపూట మందు తాగి, దేవుడి విగ్రహం ముందు పిచ్చిపిచ్చిగా చిందులు వేయడమేనా మీ సనాతన ధర్మం? పోనీ ఈ డ్యాన్సులు చేసేవాళ్లకు ఒక్క వినాయక మంత్రమైనా వచ్చా? ఈ నవరాత్రుల్లో నిష్టగా చదవాల్సిన ‘గణపతి అథర్వశీర్ష’ గురించి ఎంతమందికి తెలుసు? డ్యాన్సులు చేయాలనే కోరిక ఉంటే క్లబ్బులు, పబ్బులకు వెళ్లి ఎంజాయ్ చేయండి. పవిత్రమైన పూజల ముసుగులో రోడ్లపై ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు’

‘సనాతన సంప్రదాయాల ప్రకారం పూజలు, క్రతువులు, నిమజ్జన కార్యక్రమాలు ఏవైనా సరే సూర్యాస్తమయానికి ముందే పూర్తి కావాలి. అంతెందుకు మానవుల అంత్యక్రియలే సాయంత్రం ఆరు గంటల దాటితే చేయరు. అలాంటిది దేవుడి నిమజ్జనాన్ని రాత్రిపూట ఎలా చేస్తారు? ఒక నిమిషం ముందు వరకు భక్తి శ్రద్ధలతో కొలిచిన మట్టి, పీవోపీ విగ్రహాలను ఆ తర్వాత నిర్లక్ష్యంగా నీళ్లలోకి విసిరేయడం చూస్తుంటే బాధ కలుగుతోంది. ఈ మూర్ఖత్వానికి వెంటనే స్వస్తి పలకండి. గణేశ్ ఉత్సవాలను ప్రారంభించింది ప్రజల్లో ఐక్యత సాధించడానికే తప్ప డీజే పార్టీలు చేసుకోవడానికి కాదు. నేను రెండు దశాబ్దాలుగా గణపతిని ఆరాధిస్తున్నాను. ప్రశ్నించినందుకు ఒక మహిళ అయిన నాపై అసభ్యకరమైన కామెంట్లతో ట్రోలింగ్ చేయడమేనా మీ సనాతన ధర్మం?’ అని ట్రోలర్స్‌ని రేణు దేశాయ్ గట్టిగా ప్రశ్నించింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. చాలా మంది నెటిజన్లు రేణూ దేశాయ్ కు మద్దతు నిస్తూ కామెంట్స్ పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

రేణూ దేశాయ్ వీడియో..

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us