AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hello Brother: ‘హలో బ్రదర్’ సినిమాలో నాగార్జున డూప్ ఇప్పుడు ఒక స్టార్ హీరో అని తెలుసా? అసలు ఊహించలేదుగా..

: టాలీవుడ్ కింగ్, అక్కినేని నాగార్జున మొదటి సారి డ్యూయెల్ రోల్ చేసిన సినిమా హలో బ్రదర్. ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ లో నాగ్ రెండు పాత్రల్లోకనిపించడానికి.. ఆయన డూప్ గా టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ హీరో నటించాడు.

Hello Brother: 'హలో బ్రదర్' సినిమాలో నాగార్జున డూప్ ఇప్పుడు ఒక స్టార్ హీరో అని తెలుసా? అసలు ఊహించలేదుగా..
Hello Brother Movie
Basha Shek
|

Updated on: Sep 25, 2026 | 7:58 PM

Share

సాధారణంగా సినిమాల్లో భారీ యాక్షన్స్ సన్నివేషాలు ఉన్నప్పుడు, లేదా డ్యుయల్ పాత్ర చేయాలన్నప్పుడు హీరోల స్థానంలో డూప్ లను పెట్టి ఆ సన్నివేశాలను చిత్రీకరిస్తూ ఉంటారు. అక్కినేని నాగార్జున నటించిన హలో బ్రదర్ సినిమా విషయంలోనూ అదే జరిగింది. ఈ సినిమాలో నాగ్ రెండు డిఫరెంట్ పాత్రల్లో కనిపించారు. అయితే ఇందులో నాగార్జునకు డూప్ గా నటించిన ఒక వ్యక్తి ప్రస్తుతం స్టార్ హీరో అని చాలామందికి తెలియదనే చెప్పాలి. దివంగత స్టార్ డైరెక్టర్ ఈ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వంలో ఈ చిత్రంలో సౌందర్య, రమ్యకృష్ణ, నెపోలిలియన్, బ్రహ్మానందం, కోటా శ్రీనివాసరావు, అలీ, శరత్ బాబు, సంగీత, చరణ్ రాజ్, సుధ, అన్నపూర్ణ, శ్రీలక్ష్మీ, మల్లికార్జున రావు, రాజనాల తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. 1994లో రిలీజైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ‘దేవా’, ‘విక్రమ్’ అనే ఇద్దరు కవల సోదరుల పాత్రల్లో నాగార్జున అద్బుతంగా జీవించారు. ముఖ్యంగా ఇద్దరు నాగార్జునలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించే సన్నివేశాలు, వారిద్దరి మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే అభిమానులు పండగ చేసుకున్నారు.

సాధారణంగా స్టార్ హీరోలకు డూప్ లు గా నటించేవారు వేరే ఉంటారు. లేదంటే కొన్ని సార్లు జూనియర్ ఆర్టిస్టులనైనా తీసుకువస్తారు. కానీ హలో బ్రదర్ సినిమాలో మాత్రం నాగార్జునకు డూప్ గా ఓ స్టార్ హీరో నటించారన్న విషయం చాలా మందికి తెలియదు. ఆయన మరెవరో కాదు హ్యాండ్సమ్ హీరో శ్రీకాంత్. ఈ సినిమాలో నాగార్జున శరీర ఆకృతికి, ఎత్తుకు సరిగ్గా సరిపోయే డూప్‌ను ఎంచుకోవడం ఎంచుకోవడం కష్టమైంది. దీంతో ఈ పాత్ర కోసం నటుడు శ్రీకాంత్ అయితేనే సరిపోతాడని డైరెక్టర్ ఈవీవీ అనుకున్నారు. అయితే అప్పటికే శ్రీకాంత్ కూడా మంచి స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. దీంతో నాగార్జున డూప్ గా చేయడానికి ఒప్పుకుంటాడా అనే ఆలోచన అందరిలో ఉంది. చివరికి ఈవీవీ మొహమాటపడుతూనే వెళ్లి శ్రీకాంత్ కి విషయం చెప్పారు. ఈవీవీతో శ్రీకాంత్ కి మంచి అనుబంధం ఉంది. వీరి కాంబినేషన్ లో పలు సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. దీంతో ఈవీవీ అడిగిన దానికి వెంటనే ఒకే చెప్పారు శ్రీకాంత్. అలా హలో బ్రదర్ సినిమా పట్టాలెక్కింది. టాలీవుడ్ లో మొదటి సారి ఒక హీరోకు మరో స్టార్ హీరో డూప్ గా నటించడం హలో బ్రదర్ సినిమాలోనే మొదటి సారి కావడం విశేషం.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us