AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉదయపు టిఫిన్‌గా అదిరిపోయే కమ్మని బియ్యపు రవ్వ పులిహోర.. తింటే రించికి ఫిదా అవ్వాల్సిందే

 తెలుగువారి పండుగలలో, పూజా కార్యక్రమాలలో నైవేద్యం అనగానే మొదటిగా గుర్తొచ్చేది పులిహోర. అయితే అన్నంతో కాకుండా పూర్వం అమ్మమ్మలు, నానమ్మలు బియ్యపు రవ్వతో చేసే 'రవ్వ పులిహోర' దీనినే పిండి పులిహోర అని కూడా అంటారు రుచి ఎంతో అద్భుతంగా ఉంటుంది. చాలామంది బియ్యపు రవ్వ అనగానే ఉప్మా రవ్వ లేదా ఇడ్లీ రవ్వ అనుకుంటారు; కానీ బియ్యంతో కొద్దిగా లావుగా పట్టించిన బియ్యపు రవ్వ  మార్కెట్లో విడిగా లభిస్తుంది. 

Phani CH
|

Updated on: Sep 25, 2026 | 5:41 PM

Share
కావలసిన పదార్థాలు: 250 గ్రాముల బియ్యపు రవ్వ, 4 కప్పులు నీళ్లు ఇక్కడ రవ్వ తీసుకున్న కప్పు కొలతతో నీళ్లు తీసుకోవాలి, 2 టీస్పూన్లు ఉప్పు, అర టీస్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల వంట నూనె, 4 మీడియం సైజు నిమ్మకాయల రసం. ఘుమఘుమలాడే తాలింపు కోసం: 4 టేబుల్ స్పూన్ల నూనె, కొద్దిగా వేరుశనగ గుళ్లు, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపగుళ్లు, 1 టీస్పూన్ ఆవాలు, 1 టీస్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సన్నని అల్లం తరుగు, 5-6 సన్నగా తరిగిన పచ్చిమిర్చి,  3-4 ఎండుమిర్చి, తాజా కరివేపాకు, పావు టీస్పూన్ ఇంగువ చాలా ముఖ్యం.

1 / 5
తయారీ విధానం: అడుగు మందంగా ఉన్న పాత్ర లేదా పాన్‌లో 4 కప్పుల నీళ్లు పోసి మూతపెట్టి మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు 2 టీస్పూన్ల ఉప్పు, అర టీస్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. ఇప్పుడు ఒకటిన్నర కప్పుల బియ్యపు రవ్వను వేస్తూ ఉండలు కట్టకుండా వెంటనే గరిటెతో బాగా కలపాలి. మీడియం మంటపై రెండు నిమిషాలు ఉడికించి, మిశ్రమం దగ్గరపడ్డాక మంటను పూర్తిగా లో ఫ్లేమ్‌లో పెట్టి మూతపెట్టాలి.

2 / 5
నీరంతా ఆవిరై రవ్వ మెత్తగా ఉడికేవరకు మధ్యమధ్యలో కలుపుతూ 7 నుండి 10 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ రవ్వను పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారాక ముద్ద లేకుండా చక్కగా పొడిపొడిగా మారుతుంది. మరో పాన్‌లో 4 టేబుల్ స్పూన్ల నూనె వేడిచేసి మొదట పల్లీలు వేసి సగం వేగనివ్వాలి.

3 / 5
ఆ తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి దోరగా ఎర్రగా వేయించాలి. అనంతరం సన్నని అల్లం ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి అల్లం పచ్చివాసన పోయేలా వేపాలి. చివరగా పావు టీస్పూన్ ఇంగువ వేసి స్టవ్ ఆపేయాలి.

4 / 5
పోపు ఉన్న పాత్రలోకి లేదా వెడల్పాటి తాంబూలంలోకి చల్లారిన బియ్యపు రవ్వను వేయాలి. దీనిపై 4 నిమ్మకాయల రసాన్ని పోయాలి. గరిటె కంటే చేత్తో నలుపుతూ కలిపితే పోపు, నిమ్మరసం రవ్వకు సమంగా పట్టి ఉండలు లేకుండా పులిహోర పొడిపొడిగా తయారవుతుంది. అంతే, నోరూరించే బియ్యపు రవ్వ పులిహోర సిద్ధం! దేవుడి నైవేద్యానికి ప్రసాదంగా సమర్పించినా, ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా తిన్నా అమృతంలా ఉంటుంది

5 / 5
Follow Us
ఉదయపు టిఫిన్‌గా అదిరిపోయే కమ్మని బియ్యపు రవ్వ పులిహోర

పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఇక విత్‌డ్రా చేయడం మరింత ఈజీ

అక్టోబర్ నెలలో వీరి జీవితంలో కీలక మలుపు..! లిస్ట్‌లో మీ రాశి ఉందా

రష్యాపై వందల డ్రోన్లతో దాడి.. చమురు రిఫైనరీని ఉక్రెయిన్ ధ్వంసం

ఇదబ్బా అసలైన గోంగూర పచ్చడి.. ఒక్క ముద్ద రుచి చూస్తే అస్సలు వదలరు!

గణపతి నిమజ్జనం ఎందుకు చేస్తారో తెలుసా? వెనుక ఉన్న రహస్యం ఇదే!

SBIలో 222 ఉద్యోగాలు.. మరికొన్ని గంటలే అవకాశం!

శ్రాద్ధం పెట్టినా కాకి రాలేదా? భయపడకండి.. ఈ 3 పనులు చేయండి!

ఒక్క నిద్ర ఆమె జీవితాన్ని మార్చేసింది.. రూ. 850 కోట్ల పరిహారం

ఇంట్లో డబ్బు నిలవడం లేదా? ఫ్రిజ్‌పై ఈ వస్తువులు పెట్టండి!