AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SIM Card Rules: సిమ్‌ కార్డు వాడే వారికి బిగ్‌ అలర్ట్.. ఇలా చేస్తే రూ.50లక్షల జరిమానా!

దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న సిమ్‌కార్డుల దుర్వినియోగం నేపథ్యంలో భారత టెలికమ్యూనికేషన్స్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సిమ్‌ కార్డు నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ కొత్త రూల్స్‌ను తీసుకొచ్చింది. సెప్టెంబర్ 21 నుంచి ఈ కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. మరి ఈ కొత్త మార్గదర్శకాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

Anand T
|

Updated on: Sep 25, 2026 | 6:37 PM

Share
దేశంలో పెరుగుతున్న సిమ్‌కార్డు దుర్వినియోగాన్ని అరికట్టేందుకు టెలికమ్యూనికేషన్ శాఖ కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. అయితే వివిధ అవసరాల దృష్ట్యా జనాలు ఒకటికి మించి సిమ్‌కార్డులను యూజ్ చేస్తున్నారు. ఇలా ఒకే వ్యక్తికి రెండు, మూడు సిమ్‌ కార్డులు ఉంటే ఎలాంటి సమస్య లేదు. కానీ వాటిని ఎలా వాడుతున్నారు అనేది ఇక్కడ పెద్ద సమస్య. దీన్ని అరికట్టేందుకు ఇప్పుడు కొత్త రూల్స్ తీసుకొచ్చారు.

1 / 5
కొన్ని సార్లు మన పేరుపై తీసుకున్న సిమ్‌ పోగొట్టుకుపోవడమో లేదా మనమే వేరే వారికి మన పేరుమీద సిమ్‌కార్డును తీసి ఇవ్వడమో చేస్తుంటాం. కానీ ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో మనమే చిక్కుల్లో పడే ఛాన్స్ ఉంది. అవును, మన గుర్తింపు కార్డులతో తీసుకున్న సిమ్‌తో వేరే వ్యక్తులెవరైనా నేరాలు చేస్తే.. దానికి పూర్తి బాధ్యత ఆ సిమ్‌ ఎవరి పేరుపై ఉంటుందో వారే వహించాల్సి ఉంటుంది.

2 / 5
తాజాగా టెలికమ్యూనికేషన్ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. సిమ్ కార్డును మోసాలకు ఉపయోగించినా, లేదా చట్టవిరుద్ధంగా వేరొకరికి వాడటానికి ఇచ్చినా రూ. 50 లక్షల వరకు జరిమానాతో పాటు 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది. కాబట్టి మీ పేరుపై ఉన్న సిమ్‌ కార్డులను వేరే వాళ్లకు అస్సలు ఇవ్వకండి.

3 / 5
ఈ మధ్య కాలంలో ఒకే వ్యక్తి పేరు మీద అనేక సిమ్ కార్డులు తీసుకుని, వాటితో కొందరు సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్న ఘటనలు పెరగడంతో.. వాటికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ కొత్త రూల్స్ తీసుకొచ్చినట్టు టెలికాం శాఖ స్పష్టం చేసింది. అలాగే వినియోగదారులు తమ సిమ్‌ కార్డుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

4 / 5
ఎవరైనా పొరపాటున మొబైల్ ఫోన్ లేదా సిమ్‌ కార్డును మిస్ చేసుకున్నా.. వెంటనే దాన్ని బ్లాక్ చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలని పేర్కొంది. అలాగే అనవసరంగా ఎవరికీ మీ గుర్తింపుతో సిమ్‌ కార్డులు ఇప్పించొద్దని.. కచ్చితమైన అవసరం లేకుండా ఒకటికి మించి సిమ్‌ కార్డులను కూడా తీసుకోవద్దని టెలికమ్యూనికేషన్ శాఖ తెలిపింది.

5 / 5
Follow Us