AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాకు నెగెటివ్ రివ్యూలు, హీరో నాని ఏమన్నారంటే?

న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'ది ప్యారడైజ్'. శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గురువారం (సెప్టెంబర్ 24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే భారీ అంచనాలతో రిలీజైన ఈ మూవీకి నెగెటివ్ రివ్యూస్ వచ్చాయి.

The Paradise: 'ది ప్యారడైజ్' సినిమాకు నెగెటివ్ రివ్యూలు, హీరో నాని ఏమన్నారంటే?
The Paradise Movie
Basha Shek
|

Updated on: Sep 25, 2026 | 5:49 PM

Share

‘దసరా’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా ‘ది ప్యారడైజ్‌’. పీరియాడికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో కయాదు లోహర్‌ కథానాయిక. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు, రాఘవ్ జుయేల్, సోనాలి కులకర్ణి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. గురువారం (సెప్టెంబర్ 24) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు భారీ కలెక్షన్లు వచ్చాయి. మొదటి రోజే రూ. 88 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అయితే ది ప్యారడైజ్ సినిమాకు చాలా మంది నెగెటివ్ రివ్యూలు ఇచ్చారు. సోషల్ మీడియాలోనూ ఈ చిత్రంపై ట్రోల్స్ వస్తున్నాయి. ఇప్పుడు వీటిపై హీరో నాని స్వయంగా స్పందించాడు. ది ప్యారడైజ్ సినిమాపై వస్తోన్న ట్రోల్స్ నెగిటివిటీ గురించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు.

‘ది ప్యారడైజ్‌’సినిమా పై మీ అభిప్రాయాలు, స్పందన అన్నింటినీ చూశా. మీరు చూపించిన ప్రేమతో పాటు, సరదా ట్రోల్స్‌ను కూడా స్వీకరిస్తున్నా. దీనిని తమ సినిమాగా ప్రేక్షకులు స్వీకరించిన తీరు నా హృదయానికి హత్తుకుంది. అదే సమయంలో సినీ విమర్శకులు, రివ్యూవర్లు ఎత్తి చూపిన పొరపాట్లు, లోటుపాట్లను పరిగణనలోకి తీసుకుంటాను. మీ అందరికీ కృతజ్ఞతలు. మీకు ప్రత్యేకమైన అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో రక్తం, చెమట చిందించి ది ప్యారడైజ్ సినిమాను తీర్చిదిద్దాం. మీరు దీన్ని సంబరంగా చేసుకోవచ్చు. విమర్శించవచ్చు. సినిమాపై మీరు చూపించిన ఉత్సాహం, నాపై కురిపించిన ప్రేమ, ఆప్యాయతకు నాలో కృతజ్ఞత భావాన్ని నింపాయి’ అని ట్వీట్ చేశాడు నాని.

ఇవి కూడా చదవండి

హీరో నాని ట్వీట్..

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ది ప్యారడైజ్ సినిమాను నిర్మించారు. అనిరుధ్ ఈ మూవీకి స్వరాలు సమకూర్చారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ తదితర భాషల్లోనూ ఈ సినిమా రిలీజైంది.

తొలి రోజే రికార్డు కలెక్షన్లు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us