AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ 2nd ODI: భారత్, న్యూజిలాండ్ రెండో వన్డేపై వరుణుడి పంజా.. మ్యాచ్ రద్దు ?

IND vs NZ 2nd ODI: భారత్, న్యూజిలాండ్ రెండో వన్డేపై వర్షం నీలినీడలు కమ్ముకున్నాయి. నవంబర్ 7న వెల్లింగ్టన్‌లో జరగాల్సిన ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గంటల వారీగా వర్షం అంచనాలు ఎలా ఉన్నాయి? మ్యాచ్ రద్దయ్యే ప్రమాదం ఉందా? సిరీస్‌లో ప్రస్తుతం టీమిండియా పరిస్థితి ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

IND vs NZ 2nd ODI: భారత్, న్యూజిలాండ్ రెండో వన్డేపై వరుణుడి పంజా.. మ్యాచ్ రద్దు ?
Wellington Weather
Rakesh
|

Updated on: Nov 06, 2026 | 12:46 PM

Share

IND vs NZ 2nd ODI: భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో రెండో మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా మారనున్నాడు. తొలి వన్డేలో వర్షం కారణంగా డీఎల్ఎస్ పద్ధతిలో విజయం సాధించిన టీమిండియాకు ఇప్పుడు మరోసారి అదే సమస్య ఎదురయ్యేలా కనిపిస్తోంది. నవంబర్ 7న వెల్లింగ్టన్‌లోని హెచ్ఎన్ఆర్ఐ స్టేడియంలో రెండో వన్డే జరగనుంది. అయితే అక్కడి వాతావరణ పరిస్థితులు అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మ్యాచ్ పూర్తిగా జరగకపోవచ్చని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి.

మధ్యాహ్నం నుంచే వర్షం ముప్పు

నవంబర్ 7న వెల్లింగ్టన్‌లో వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. అదే సమయంలో వర్షం పడే సూచనలు ఉండటం టీమిండియాకు ఇబ్బందిగా మారింది. కొన్ని వాతావరణ అంచనాల ప్రకారం రోజంతా వర్షం కురిసే అవకాశం 60 నుంచి 75 శాతం వరకు ఉంది. శుక్రవారం కూడా వర్షం కారణంగా ఇరు జట్ల ప్రాక్టీస్ షెడ్యూళ్లు మారాయి. న్యూజిలాండ్ జట్టు ఇండోర్‌లో ప్రాక్టీస్ చేయగా, భారత జట్టు శిక్షణను రద్దు చేసుకుని హోటల్‌కే పరిమితమైంది.

గంటల వారీగా వర్షం అంచనాలు ఇవే

మధ్యాహ్నం 3 గంటలకు వర్షం పడే అవకాశం 55 శాతంగా ఉండగా, 4 గంటలకు ఇది 60 శాతానికి పెరగనుంది. సాయంత్రం 5 గంటలకు 20 శాతం, 6 గంటలకు 15 శాతం, 7 గంటలకు 20 శాతంగా వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఈ సమయంలో మ్యాచ్ కొనసాగేందుకు కొంత అవకాశం కనిపిస్తోంది. అయితే రాత్రి 8 గంటలకు వర్షం ముప్పు మళ్లీ 43 శాతానికి చేరనుంది. రాత్రి 9 గంటలకు 47 శాతం, 10 గంటలకు 51 శాతం, 11 గంటలకు 40 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు అంచనా. దీంతో మ్యాచ్‌కు పలుమార్లు అంతరాయం కలిగే ప్రమాదం ఉంది.

కోహ్లీ ఇన్నింగ్స్‌తో భారత్ విజయం

ఆక్లాండ్ వేదికగా జరిగిన తొలి వన్డేలోనూ వర్షం మ్యాచ్‌కు అంతరాయం కలిగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 40.2 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనలో భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వర్షం రావడంతో డీఎల్ఎస్ పద్ధతిలో లక్ష్యాన్ని 32 ఓవర్లలో 143 పరుగులుగా మార్చారు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 51 బంతుల్లో 74 పరుగులతో అద్భుతంగా ఆడాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 37 పరుగులు చేశాడు. దీంతో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఐదు వన్డేల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.

మ్యాచ్ రద్దయితే సిరీస్ పరిస్థితి ఏంటి?

రెండో వన్డే పూర్తిగా వర్షం కారణంగా రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. అప్పుడు భారత్ సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని కొనసాగిస్తుంది. అయితే వర్షం మధ్యలో తగ్గి మ్యాచ్ నిర్వహించేందుకు అవకాశం వస్తే ఓవర్లను కుదించి డీఎల్ఎస్ పద్ధతిలో ఫలితాన్ని నిర్ణయించే వీలుంటుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ నవంబర్ 7న ఉదయం 7:30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. టాస్ ఉదయం 7 గంటలకు జరగనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us